ఖమ్మం జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు
** గోదాముల్లో భద్రపరిచిన అధికారులు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్):
ఖమ్మం జిల్లాకు బతుకమ్మ చీరలు రానే వచ్చాయి.. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణి చేస్తున్నారు.
Allso read:- కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా 18 ఏళ్లు పైబడిన ఆడపడుచులకు ప్రతి ఏటా బతుకమ్మ చీరలను ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది బతుకమ్మ పండుగకు గాను రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను జిల్లాకు పంపించింది. గురువారం చేరుకున్న బతుకమ్మ చీరలను జిల్లా అధికారులు గోదాములో భద్రపరిచారు. జిల్లాలో మొత్తం 5.03 లక్షల మంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Allso read:-నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.