Telugu News

బతుకమ్మ మన పూల పండగ: మంత్రి పువ్వాడ

మన ఆత్మ గౌరవం ను కాపాడింది సీఎం కేసీఆర్

0
బతుకమ్మ మన పూల పండగ: మంత్రి పువ్వాడ
== మన ఆత్మ గౌరవం ను కాపాడింది సీఎం కేసీఆర్
== ఖమ్మం అంటే అభివృద్ధికి గుమ్మం
== మన నగరంను మనమే అభివృద్ది చేసుకున్నాం
== బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ, ఆయన కుటుంబ సభ్యులు
 
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
బతుకమ్మ మన పూల పండగ, మన మహిళల పండుగ అని పూలను పూజించే గొప్ప సంస్కృతి కలిగిన పండుగ బతుకమ్మ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో ఎర్పాటు చేసిన అట్ల బతుకమ్మ వేడుకల్లో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, పువ్వాడ వసంత లక్ష్మీ, కోడలు సాయి శిరిని లు పాల్గొన్నారు. నగరంలోని 8, 11, 14, 22, 25, 26, 29, 30, 34, 36, 44, 46, 55వ డివిజన్ లలో ఎర్పాటు చేసిన అటుకుల బతుకమ్మలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. అట్ల బతుకమ్మ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతలా పండుగ జరుపుకుంటున్నాం అంటే అందుకు కారణం సీఎం కెసిఆర్  అని, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ.. మన ఆత్మ గౌరవం ను కాపాడారని అన్నారు.ఖమ్మం అంటే అభివృద్ధికి గుమ్మం అని, మన నగరం ను మనమే అభివృద్ది చేసుకున్నామని ఇంతకు రెండింతలు అభివృద్ది చేసుకుందామని అన్నారు.
నగరంలోని అన్ని ప్రధాన రహదారులు అన్ని వెడల్పు చేసుకున్నామని, అక్కడ సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ను ఎర్పాటు చేసి అభివృద్ది చేశామన్నారు.
2018 ఎన్నికల్ల సమయంలో కేటీఆర్ గారు వచ్చి గాంధీ చౌక్ నందు పంజరంలో ఉన్న గాంధీ విగ్రహానికి విముక్తి కల్పించాలని చెప్పారు.
అభివృద్ధి పథంలో నడుస్తున్న ఖమ్మం నగరాన్ని ఇతరులను గెలిపించి కొనసాగుతున్న అభివృద్దికి అడ్డు పడొద్దు అనుకుంటే మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.మహిళలందరికీ మరోసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, పసుమర్తి రాంమోహన్, గోళ్ళ వెంకట్, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ, ముక్కాల కమల, మోతారపు శ్రావణి సుధాకర్, పల్లా రోజ్ లీన, సరిపుడి రమాదేవి సతీష్, కూరాకుల వలరాజ్, పాలేపు విజయ రమణ, నాయకులు యర్రా అప్పారావు, పగడాల నాగరాజు, దేవభక్తుని కిషోర్ బాబు, తోట వీరభద్రం, పత్తిపాక రమేష్, కనకం భద్రయ్య, బోల్లేపల్లి విజయ్ ఆదిత్య, ముక్కాల రాజేష్ తదితరులు ఉన్నారు.