Telugu News

మొక్కజొన్న చేలకు వెళ్లి రైతులను కలిసిన భట్టి

రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత

0

మొక్కజొన్న చేలకు వెళ్లి రైతులను కలిసిన భట్టి

—రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత

—-గోడు వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమైన కూలీలు

(ఖమ్మం విజయం న్యూస్);-

ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు  చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) ఈ రోజు ( మంగళవారం) చింతకాని మండలం నేరడ నుంచి కోమట్లగూడెం గ్రామానికి వెళ్తుండగా నేరడ శివారులో వ్యవసాయ కూలీలు మండుటెండలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న దృశ్యాన్ని చూసి పొలం గట్ల వెంట నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు.

also read;-సాయుధ బలగాలకు 100 రోజుల సెలవులు!

వ్యవసాయ కూలీల సమస్యలు వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నేరేడకు చెందిన రసూల్ బి తన గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటిపర్యంతమై విలపించింది. తన బిడ్డకు క్యాన్సర్ వస్తే చికిత్స చేయించడానికి 5లక్షల అప్పు చేశానని, అయినా తన బిడ్డ బతకలేదని బోరున విలపించింది. తన బిడ్డ కోసం చేసిన ఐదు లక్షల అప్పు తీర్చడానికి కూలి పని చేయడం తప్ప మరో ఆధారం లేదని వాపోయింది.

ఉండటానికి సైతం ఇల్లు లేదని రేకుల షెడ్డులో ఉంటున్నామని, ఎండాకాలంలో చెట్ల కిందే జీవనం కొనసాగిస్తున్నామని తన ఆవేదనను వెలిబుచ్చింది. తనకు ఉండడానికి గూడు లేదని ఊర్లో ఎవరు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని సర్కార్ బిల్డింగ్లో పిల్లలతో తలదాచుకుంటున్నామని మరో వ్యవసాయ కూలీ మడిపల్లి కమలమ్మ సీఎల్పీ నేతకు తన గోడు వెళ్లబోసుకుంది.

also read;-కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలి.

*పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ, పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని నేరడ గ్రామానికి చెందిన మొక్క జొన్న రైతు పుల్లమ్మ తన పంట పరిస్థితి గురించి సీఎల్పీ నేత కు వివరించింది. మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువులు దొరకడం లేదని, గోదావరి డిఎపి అందుబాటులో లేదని, మందు బస్తాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని చెప్పింది.

పెరిగిన ధరలతో ఎకరానికి పెట్టుబడి రూ.30వేలు దాటినప్పటికీ కల్తీ విత్తనాలతో దిగుబడి 10 క్వింటాలు కూడా రావడం లేదని తను పండించిన పంట గురించి మహిళా రైతు పుల్లమ్మ వివరించారు. వారి స్థితిగతులు, సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్న తర్వాత ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన వివరాలను వారికి తెలియజేశారు. మీ పొలం వద్దకు అధికారులు వచ్చి పంట నష్టం వివరాలు తెలుసుకుని పంపించి మీకు పరిహారం ఇస్తారని ధైర్యం చెప్పారు. *అధికారులు మీ పంట పొలాల వద్దకు రాకుంటే నాకు ఫోన్ చేయండి. నేను మీ పంట పొలాల వద్ద కు పంపిస్తానని వారికి భరోసా ఇచ్చి ముందుకు సాగారు.