Telugu News

కేసీఆర్ సర్కార్ పై భట్టి సంచలన వ్యాఖ్యలు

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్

0

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్

** హుజురాబాద్ లో కాంగ్రెస్ విజయం తధ్యం

** విలేకర్ల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి, మదుయాష్కి గౌడ్

(హుజురాబాద్ ప్రత్యేక ప్రతినిధి- విజయం న్యూస్)

ఉపఎన్నికల భాగంగా, కమలపూర్ మండలం లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి  గౌడ్, సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క మీడియా తో మాట్లాడారు.

వారి మాటల్లోనే..

👉 వస్తున్న దారిలో కొంత మంది రైతులను కలవడం జరిగింది. వాళ్లు చెప్పిన విషయాలను వింటే అర్థం అవుతుంది కేసీఆర్ ప్రజలను రైతులను ఏవిధంగా మోసం చేస్తున్నారో.
👉 హుజూరాబాద్, కరీంనగర్ రైతులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రావడం లేదు పోచంపాడు నీళ్లతోనే పంటలు పండిస్తున్నాం అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటి సాంద్రత పెరిగిన ఏం లాభం లేదని చెప్పారు.

👉 మొన్నటి వరకు వరి వేస్తే ఉరే అని చెప్పి వరి కొనలేం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐకెపి సెంటర్లను పెట్టారు. ఇది అంత కేవలం ఎన్నికలు పూర్తి అయ్యే వరకే అని రైతులు చెప్పడం కేసీఆర్ మాయమాటలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు అని స్పష్టం అవుతుంది అన్నారు.

Also read :- హుజురాబాద్ లో అగ్రనేతల ఆరంగేట్రం…

👉 రబ్బర్ చెప్పులు వేసుకునే నాయకులకు ఇన్ని వేళా కోట్ల ఎలా సంపాదించారు.?

👉 సిద్దిపేట దగ్గర ఉన్న మెడికల్ కాలేజి లో ఈటెల – కేసీఆర్ ఇద్దరు బాగస్వాన్యులు.

👉 శ్రీమతి సోనియాగాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రాజకీయ ప్రయోజనం లేకపోయినా, ఏ ఒక్క బిడ్డ ప్రాణం కూడా పోకూడదు అని ఒక తల్లి లాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు.

👉 తెలంగాణలో కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరుగుతుంది. చదువుకోవాలంటే కళాశాలలు మూత పెడుతున్నారు. విద్యార్థులను చదువులకు దూరం పెడుతున్నారు. ఈ దగాకోరు కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగం అవుతుంది.

👉 NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ నిరంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటం చేస్తూ ప్రజాసమస్యలపై గళమెత్తారు. తన పక్కటెముకలు విరిగిన కాంగ్రెస్ జెండాని వదలకుండా ప్రభుత్వం పై పోరు నడిపారు.

👉 మొహంజాహి మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే తలసాని ఈ రోజు చేపలు బర్లు, గొర్లు ఇచ్చి అవే ఉద్యోగాలు అంటున్నాడు.

👉 కాంగ్రెస్ పార్టీ విద్యలో రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టే నేను ఈ రోజు నా కాళ్లపై నిలబడగలుగుతున్నాను.
స్వతహాగా నేను గౌడ్ కులస్తున్ని కల్లు గీసి నన్ను చదివించారు. కులవృత్తులు చేసే వాల్లు వాటికే పరిమితం కావాలా.?

👉 మనవాళ్లు డాక్టర్ ఇంజనీర్లు కావాల్న గొర్లు బర్లు కాయాల్న అని హుజూరాబాద్ ప్రజలు నిర్ణయించుకోవాలి.

👉 హుజూరాబాద్ ఓటరు మహశయులకు అవినీతి కేసులో ఈటెల రాజేందర్, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన కేసీఆర్ టీఆర్ఎస్ కు మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పండి.

👉 బల్మూరు వెంకట్ కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని పత్రిక మిత్రుల ద్వారా హుజురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా హుజురాబాద్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది..

Also read:- ఎన్నికల క్రతువులో అధికార యంత్రాంగం