Telugu News

భట్టి అడుగు జాడల్లో మల్లు నందిని

అడుగులో అడుగేస్తూ..అల్లంత దూరం ప్రయాణం చేస్తూ

0

భట్టి అడుగు జాడల్లో నందిని

==అడుగులో అడుగేస్తూ..అల్లంత దూరం ప్రయాణం చేస్తూ

== ప్రశంసలు అందుకున్న మల్లు నందిని

ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 10(విజయంన్యూస్)

సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క అడుగుజాడల్లో నడుస్తున్నారు ఆయన సతిమణీ మల్లు నందిని. మధిర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మూడవ సారి విజయం సాధించిన నాటి నుంచి మల్లు నందిని తన భర్త భట్టి విక్రమార్క అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, ప్రైవేట్ పంక్షన్లకు హాజరువుతూ భట్టి విక్రమార్క కార్యక్రమాలను పాలుపంచుకుంటూ తన పతి జాడల్లోనే పయనిస్తున్నారు. ఎక్కడ రాజకీయాలకు తావు ఇవ్వకుండా తన భర్త అడుగుజాడల్లోనే అమ్మపౌండేషన్ పేరుతో ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో అప్యాయతంగా ఉంటూ అందర్ని పలకరిస్తూ వారి మంచి చెడులను తెలుసుకుంటూ ప్రజల్లో కలివిడిగా తిరుగుతున్నారు. తన భర్త పార్టీలోనే ఆగ్రస్థానంలో ఉండగా ఆమె మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వారు తలుసుకుంటే ఏ పదవి అయిన వాళ్ల కాళ్ల దగ్గర ఉంటుంది. కానీ భట్టి విక్రమార్క విజన్ కు తగ్గట్లుగా ఆమె నడుచుకుంటున్నారు.

== పాదయాత్రలో ఆమె సైతం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టే పాదయాత్రలో ఆమె కూడా పాల్గొంటున్నారు. ఇటీవలే మధిర నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించిన మహాపాదయాత్రలో అన్ని గ్రామాల్లో భట్టి విక్రమార్కతో పాటు పాదయాత్ర చేశారు. ఆయన అడుగులో అడుగు వేస్తూ మాదాపురం నుంచి ఎర్రుపాలెం మండలం జమలాపురం వరకు భట్టి విక్రమార్కతో పాటు కలిసి నడిచారు. ప్రతి రోజు ఆయనకు తోడుగు, నీడగా ఉంటున్నారు. అలాగే ఈనెల 9న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 కిలోమీటర్ల దూరం పాటు ఏర్పాటు చేసిన అజాదీకా గౌరవ్ పాదయాత్ర కూసుమంచి నుంచి ప్రారంభం కాగా, ఆ పాదయాత్రలో ఆమె సైతం పాల్గొంటున్నారు. కూసుమంచి శివాలయంలో భట్టి విక్రమార్కతో పాటు కలిసి పూజలు చేసిన ఆమె భర్తతో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో ఆమెను చూస్తున్న కొంత మంది పార్టీ నాయకులు, నాయకురాళ్లు పార్టీకి చేస్తున్న ఆమె సేవలను కొనియాడుతున్నారు.  ఆమె బాటలోనే కొంత మంది మహిళలు నడుస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్రలో మహిళలు ఎక్కువ మంది పాల్గొనడం గమనర్హం.

allso read- పెరుగుతున్న గోదావరి వరద