Telugu News

వైరాలో భట్టికి ఉప్పొంగిన అభిమానం

ఘనస్వాగతం పలికిన వందలాధిమంది పార్టీ శ్రేణులు

0

వైరాలో భట్టికి ఉప్పొంగిన అభిమానం

★★ ఘనస్వాగతం పలికిన వందలాధిమంది పార్టీ శ్రేణులు

★★ వైరాలో నాలుగో రోజు కొనసాగుతున్న పాదయాత్ర
వైరా, ఆగస్టు 12(విజయంన్యూస్)
72వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏఐసీసీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అజాదీకా గౌరవ పాదయాత్ర శుక్రవారం నాలుగో రోజు కొనసాగుతోంది. పల్లిపాడులో ప్రారంభమైన ఈ పాదయాత్రలో పాల్గొన్న సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క కు నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాళోతు రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు.

Allso read–ఖమ్మంలో కదిలిజన కాంగ్రెస్ దళం

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు బట్టి విక్రమార్కుడు రాఖీ కడుతూ సోదరి భావాన్ని తెలియపరచి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అడుగడుగునా మహిళలు తిలకం దిద్ది హారతి ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆశీర్వదిస్తూ పాదయాత్రలో భట్టితో నడుస్తున్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ అభిమానం ఉప్పొంగింది.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు నర్సి రెడ్డి, హరినాథ్, కౌన్సిలర్ భత్తుల గీత, అశోక్, బాలాజీ నాయక్, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, పుచ్చకాయలవిరభద్రం, ఎడ్లపల్లి సంతోష్, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య,పెండ్ర అంజయ్య, యరబోలు శ్రీనివాస్, వీరయ్య చౌదరి, బచ్చలకూర నాగరాజు, జెర్రిపోతుల అంజని, బోయిన వేణు నాగరాజు ,.తదితరులు పాల్గొన్నారు