Telugu News

ఖమ్మంలో కదిలిజన కాంగ్రెస్ దళం

పాదయాత్రకు అడుగడుగున నీరాజనం

0

పాదయాత్రకు అడుగడుగున నీరాజనం

== ఖమ్మంలో కదిలిజన కాంగ్రెస్ దళం

== భారీ గజమాలతో భట్టి దంపతులకు సన్మానం

== దారి పొడవునా భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన మహిళలు

== ఖమ్మంలో రెండో రోజు కొనసాగిన ఆజాదీ కా గౌరవ్ యాత్రలో పాల్గొన్న భట్టి విక్రమార్క, సంభాని చంద్రశేఖర్

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు((విజయంన్యూస్)

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు బుధవారం ప్రారంభమైంది. ఈ పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ తో కలిసి ఖమ్మంలో ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహించారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి  నుంచి ప్రారంభమై కోదాడ ఎక్స్ రోడ్, వరంగల్ ఎక్స్ రోడ్, పెద్దతండ,  నాయుడుపేట, కాల్వడ్డు ఖమ్మం,  మయూరి సెంటర్, ఇల్లందు ఎక్స్ రోడ్, వైరా రోడ్,  ఇంద్ర నగర్ కాలనీలో కొనసాగింది.

ఇది కూడా చూడండి: పతితో సతి అడుగులో అడుగు

== భట్టి విక్రమార్క దంపతులకు గజమాలతో సత్కారం

75వ స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి ఖమ్మం పట్టణంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో సన్మానం చేశారు. క్రేన్ సహాయంతో భట్టి దంపతుల మెడలో గజమాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేశారు.

== దారి పొడవున బ్రహ్మరథం

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమై ఖమ్మం పట్టణానికి వస్తుండగా మార్గమధ్యలోని సూర్యాపేట రోడ్డు వద్ద మహిళలు కిలోమీటర్ మేర వరుస క్రమంలో నిలబడి ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్న విక్రమార్క గారికి ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత మహిళలు  పాదయాత్రలో పాల్గొన్నారు. డప్పుల దరువులు, మహిళల కోలాట నృత్యాలు, బంజారా బేరి నృత్యం, కళాకారుల కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : పెరుగుతున్న గోదావరి వరద