Telugu News

అధికార పక్షాన్ని బుల్డోజ్ చేసిన సీఎల్పీ భట్టి విక్రమార్క

సూటిగా.. సుత్తిలేకుండా ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకున్న భట్టి

0

అధికార పక్షాన్ని బుల్డోజ్ చేసిన సీఎల్పీ భట్టి విక్రమార్క

▪️కరుకైన పదాలు.. ఘాటైన విమర్శలు

▪️సూటిగా.. సుత్తిలేకుండా ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకున్న భట్టి

▪️సమాధానాల్లేక తలోముఖం చూసుకున్న ఆమాత్యులు

▪️జావాబియ్యలేక దాటుకుపోయినా ముఖ్యమంత్రి

(హైదరాబాద్ -విజయం న్యూస్)

తెలంగాణ శీతాకాల సమావేశాల్లో అధికార పక్షాన్ని, ఆమాత్యులను, ఆఖరుకు ముఖ్యమంత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుల్డోజ్ చేశారా? అంటే సమావేశాల సరళిని పరిశీలించిన ఎవరైనా అవుననే అంటారు. సాధారణంగా భట్టి ప్రసంగం అంటే అంకెలు, లెక్కలు.. విశ్లేషణలతో సాఫీగా సాగిపోయే అలల్లా ఉంటుంది.. అందుకు ఈ దఫా పూర్తి భిన్నంగా కరుకైన పదాలు.. ఘాటైన విమర్శలతో ప్రసంగంలో వాడివేడి పెంచారు. ఒక్కమాటలో చెప్పాలంటే సూటిగా, సుత్తి లేకుంగా ప్రభుత్వంతో ఓ ఆట ఆడేసుకున్నాడు భట్టి విక్రమార్క.

భట్టి ప్రసంగ పాఠాలే మాటల మంటలు పుట్టిస్తుంటే.. తెలంగాణ సమాజ అవసరాలు, వారి సమస్యలపై వేసే ప్రశ్నలకు సమాధానాల్లేక అధికార పక్షం, ఆమాత్యులు, ఆఖరుకు ముఖ్యమంత్రి కూడా ఒకరిముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఏర్పడింది.

పంచాయతీ సమస్యలు తీసుకుని ట్రాక్టర్ల కొనుగోలుపై భట్టి.. ఒకదశలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అత్యంత కరుకుగా మాట్లాడడం.. ప్రజలంతా గమనించారు. పంచాయతీ డబ్బులతో కొన్నారు.. మీరెక్కడ డబ్బులు ఇచ్చారు? అంటూ వరుస ప్రశ్నలతో అధికార పక్షాన్ని ఊచకోత కోశారు.

హైదరాబద్ ఒక ఐకాన్ సిటీ అంటూ మొదలు పెట్టి.. గత ప్రభుత్వాలు మ్యాన్యుమెంట్స్ వంటి నిర్మాణాలు చేస్తే.. ఏడేళ్లలో మీరేం చేశారని ఇక్కడ మట్లాడుతున్నారంటూ.. కరుకుగా వేసిన ప్రశ్నలకు మునిసిపల్ శాఖా మంత్రినుంచి సమాధానమే లేకపోయింది.

ఆ మూలనున్న ఆదిలాబాద్ కష్టాల దగ్గరనుంచి.. ఈ చివర ఉన్న మహబూబ్ నగర్ ఇబ్బందుల వరకూ.. రాష్ట్రం నలుమూలల సమస్యలపై సభలో భట్టి శరపరంపరగా ప్రశ్నల వర్షం కురిపించారు. సూచనలు ఇస్తున్నానంటూనే.. ప్రభుత్వానికి కఠువైన హెచ్చరికలే చేశారు.

ALLSO READ ; టీఆర్ఎస్ లో డిష్యూ.. డిష్యూం

గతపాలకులు.. గతపాలకులు అంటూ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రికి భట్టి విక్రమార్క గట్టిగానే సమాధానం చెప్పారు. గత పాలకులు అంటే అందులో కాంగ్రెస్.. టీడీపీ.. ప్రభుత్వాలు.. అందులో మీరున్నారు.. మేమున్నాము.. అది బాగలేకనే తెలంగాణ సమాజం పోరాటాలు చేసింది.. మేము ప్రత్యే రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర లక్ష్యాలు.. సాధించింది ఏమిటి?? అంటూ భట్టి విక్రమార్క చెప్పినదానికి పాలకపక్షం ఒక్కసారిగా దిగ్ర్భమకు గురైంది.

హైదరాబాద్ కు మంజీరా ద్వారా నీళ్లు తెచ్చింది.. క్రుష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, శ్రీ పాద ఎల్లం పల్లి నుంచి గోదావరి జలాలు తరలించేలా చేసింది కాంగ్రెస్ పాలకులు కాదా? అంటూ భట్టి చేసిన ఎదురుదాడికి ముఖ్యమంత్రి వద్దే సమాధానం లేకుండా పోయింది.

కరెంట్ మేము 24 గంటలూ ఇస్తున్నాం.. అని ప్రభుత్వం చెప్పినదానికి భట్టి విక్రమార్క అంతే ఖండితంగా సమాధానం చెప్పారు. గత ప్రభుత్వాలు పునాదులేసిన ప్రాజెక్టులు ఉత్పాదకతలోకి రావడంతో కరెంట్ వచ్చింది తప్ప మరేం లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదలు పెట్టిన భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టుల నుంచి ఉత్పాదక రావడం లేదని.. ఛత్తీస్ ఘడ్ చేసుకున్న ఒప్పందాల వల్ల విద్యుత్ రావడం లేదని సభకు భట్టి వివరించారు.

మాటల గారడీలు చేసే ముఖ్యమంత్రికి మాటలతో బుద్ధి చెప్పిన ప్రతిపక్ష నాయకుడంటూ.. వార్తా విశ్లేషకులు తాజాగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రభుత్వ వైఫల్యాలపై పాలనలోని లోపాలపై భట్టి విక్రమార్క మాటల మంటలు.. మాత్రం ప్రజలకు కొత్త భరోసాను ఇచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికారపక్షాన్ని ఒంటిచేత్తో బుల్డోజ్ చేసిన భట్టి సత్తా.. తెలంగాణ రాజకీయ యవనికపై మరో పవర్ సెంట్రిక్ పాయింట్ గా మారనుందా… ఏమవుతందో కాలమే సమాధానం చెప్పాలి

 ALLSO READ : ఏడెండ్లలో రూ.58.303 కోట్ల వ్యయం…