Telugu News

మైనార్టీల చరిత్ర లేకుండా చేయాలనేదే బీజేపీ ప్రయత్నం : భట్టి

మత విభజన చేసి రక్తపాతం సృష్టించాలని బిజెపి దుష్ట ఆలోచన

0

స్వాతంత్ర పోరాటం చేసిన మైనార్టీలెక్కడ

== బీజేపీ వారి చరిత్ర లేకుండా చేస్తోంది

== మత విభజన చేసి రక్తపాతం సృష్టించాలని బిజెపి దుష్ట ఆలోచన

== ఇంకిలాబ్ జిందాబాద్ నినాదం లేకుండా స్వాతంత్ర పోరాటమే లేదు

== జాతీయోద్యమస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బిజెపి

== పంట నష్టపరిహారం రైతులకు వెంటనే చెల్లించాలి

== పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్

ఖమ్మంప్రతినిధి,ఆగస్టు 11(విజయంన్యూస్)

స్వాతంత్ర సంగ్రామంలో విరోచితంగా పోరాడిన ముస్లిం మైనార్టీల చరిత్ర లేకుండా చేయాలని బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం ఆజాదీ కా గౌరవ్ యాత్రను మూడవరోజు ఖమ్మంలో నిర్వహించారు.  గోపాలపురం,  వెంకటాయపాలెం, తనికెళ్ళ, కొణిజర్ల, మీదుగా రాత్రికి పల్లిపాడుకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కొనిజర్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

allso read- సింగరేణిని బహుళ జాతి సంస్థలకు అమ్మే కుట్ర : భటివిక్రమార్క

స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తికి భిన్నంగా, లౌకికవాదానికి విరుద్ధంగా మతాల పేరు మీద దేశ విభజన చేసి రక్తపాతం సృష్టించాలని మతోన్మాద శక్తులు చేస్తున్న ప్రయత్నాలను స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో తిప్పి కొట్టాలన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో హిందువులతో పాటు ముస్లింలు, మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొన్నప్పటికీ వారి చరిత్ర లేకుండా చేయాలని బిజెపి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సయ్యద్ ఫజల్ ఉల్ హాసన్ లాంటి మహనీయులు దేశ స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీతో కలిసి ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేశారు.  1921వ సంవత్సరంలో  అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ స్టేషన్స్ లో దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టి నినదించిన సయ్యద్ ఫజల్ ఉల్ హాసన్ ను దేశం ఎలా మర్చిపోతుందన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో యువత  ఉప్పెనల కదిలి వచ్చేలా ఇంకిలాబ్ జిందాబాద్ అనే అద్భుతమైన నినాదాన్ని ఆయనే అందించారన్నారు. రవి అస్తమించని సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రెవల్యూషన్ పంథాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి యువతను ఒక తాటిపైకి ఇంకిలాబ్ జిందాబాద్ నినాదం తీసుకువచ్చిందన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు లాంటి పోరాట యోధులను ఈ నినాదమే ఇన్స్పైర్ చేసిందన్నారు.  ఇంకిలాబ్ జిందాబాద్ అనే నినాదమే లేకుండా స్వాతంత్ర సంగ్రామ ఘట్టమే లేదన్నారు. సంపూర్ణ స్వరాజ్యం రావడం కోసం సయ్యద్ ఫజల్ ఉల్ హాసన్ ప్రవేశపెట్టిన తీర్మానం నాంది పలికిందన్నారు.

ఈ విధంగా స్వాతంత్ర సంగ్రామంలో ముస్లిం, మైనార్టీలు పాల్గొని ఘనమైన చరిత్రను సంపాదించుకుంటే స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్రలేని బిజెపి మత విభజన పేరిట మైనార్టీల చరిత్రను కాల రాయడానికి సిగ్గుండాలన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పినటువంటి లౌకికవాదం లేకుండా చేయాలని, ఇతర మతాలు దేశంలో ఉండకూడదన్న బిజెపి ఆలోచన విధానం జాతీయోద్యమ స్ఫూర్తి కి వ్యతిరేకంగా ఉందన్నారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలలో సమానత్వం, సౌబ్రాతృత్వం ఉండాలని భారత రాజ్యాంగం చెబుతున్నప్పటికీ బీజేపీ ఆలోచన విధానం ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. దేశ స్వాతంత్ర ఫలాలు ఫలితాలను కాంగ్రెస్ ప్రజలకు  అందించిందన్నారు. కాంగ్రెస్ అందించిన ఫలాలను బిజెపి ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఆజాదీ కా గౌరవ్ యాత్రలో ఇవే అంశాలను ప్రజలకు చాటి చెప్పనున్నామని వెల్లడించారు.

allso reaD- భట్టి అడుగు జాడల్లో మల్లు నందిని

== పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

అకాల వర్షాలు, గోదావరి వరద ముంపుతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వ వెంటనే నష్టపరిహారం ఎకరానికి 15 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలు నీట మునిగి నెలరోజులు కావస్తున్న క్షేత్రస్థాయిలోకి అధికారులను ప్రభుత్వం పంపించకుండా జాప్యం చేయడంపై మండిపడ్డారు. అధికారులను పంట పొలాల పంపించి పంట నష్టం అంచనా వేయించాని ప్రభుత్వానికి సూచించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ల అవుతున్న ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. పోడు రైతుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న విధానం సరైంది కాదన్నారు. పోడు సాగు చేస్తున్న రైతులను గుర్తించి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వడం చేతకాకుంటే పోడు చేసే రైతుల జోలికి ప్రభుత్వం పోవద్దని హెచ్చరించారు. మూడు రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, వైరా కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు బానోతు బాలాజీ నాయక్, కాంగ్రెస్ మండల ఇన్చార్జి వడ్డే నారాయణరావు, ఎంపీటీసీలు వడ్డే రమాదేవి, బానోతు పద్మ, ఎ. కృష్ణార్జునరావ్, డి నాగమణి, సర్పంచులు కృష్ణారావు, దానియేలు, కమటాల రేణుక, జిల్లా మహేష్,  కాంగ్రెస్ నాయకులు కే కిషోర్, మస్తాన్ తదితరులు ఉన్నారు.

== 2వేల మందితో సీఎల్పీ నేత భట్టి భారీ ర్యాలీ

allso read- ఖమ్మంలో కదిలిజన కాంగ్రెస్ దళం

75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ఆజాదీ కా గౌరవ్ యాత్రను మూడవ రోజు గురువారం నాడు వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామానికి చేరుకున్న సందర్భంగా 2వేల మందితో వైరా కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు. 200 మందికి పైగా మహిళలు బోనాలు ఎత్తుకొని పాదయాత్రకు వెల్కం చెప్పారు. వివిధ కళారూపాలు, లంబాడి మహిళల గిరిజన సాంస్కృత నృత్యాలు, కోలాటం మహిళల నృత్యాలు, పాదయాత్ర ముందు విశేషంగా ప్రజలను ఆకట్టుకున్నాయి.  డీజే సౌండ్లు, పెద్ద ఎత్తున కాల్చిన బాణాసంచా శబ్దాలు పాదయాత్రలో హోరెత్తాయి. దారి పొడవున భట్టి విక్రమార్క గారి పైన బంతిపూల వర్షం కుమ్మరిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపుగా 2వేల మంది పాదయాత్రలో పాల్గొనడంతో భారీ ర్యాలీగా తనికెళ్ళ, కొణిజర్ల, మీదుగా  పల్లిపాడుకు  కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ.జావీద్, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి వడ్డెబోయిన నర్సింహారావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గ నాయకులు రాందాసునాయక్, కార్పోరేటర్లు సైదులు నాయక్, మల్లీదు వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, పుచ్చకాయల వీరభధ్రం, దొబ్బల సౌజన్య, యడ్లపల్లి సంతోష్, నాయకులు లక్ష్మణ్, రవి, బచ్చలకూర నాగరాజు, జెర్రిపోతుల అంజని, బోయిన వేణు, వీరారెడ్డి, హరినాథ్, అశోక్, కౌన్సిలర్ బత్తుల గీత తదితరులు హాజరైయ్యారు.