Telugu News

బయ్యారంలో భగ్గుమన్న ఉక్కు దీక్ష…!

=బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు

0

బయ్యారంలో భగ్గుమన్న ఉక్కు దీక్ష…!

==బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు

==కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిఆర్ఎస్
నాయకులు

==బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం మరో ఉద్యమం తప్పదు
==ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ మహబూబాబాద్ ఎంపీ కవిత

==(మహబూబాబాద్ విజయం న్యూస్);-

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బుధవారం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎంపీ కవిత, జిల్లా జడ్పీ చైర్మన్ కుమారి బిందు, బయ్యారం ఎం పి టి సి తిరుమల శైలజ రెడ్డి,ల ఆధ్వర్యంలో బయ్యారం బస్టాండ్ సెంటర్లో బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష నిర్వహించారు.

also read :-పాలేరులో విద్యుధాఘాతంతో రైతు మృతి

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమం ఆగదని
బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు బయ్యారం లో ఉక్కు పరిశ్రమకు అవకాశం లేదు అని బి జెపి కేంద్ర మంత్రి అనడం విడ్డూరం విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఫీజుబులిటీ లేదని కేంద్ర మంత్రి ప్రకటించడం సరికాదని అనేక పరిశీలనలు,పరిశోధనల తర్వాత వచ్చిన నివేదికలు ఉక్కు పరిశ్రమకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపిన విషయం విదితమే. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉన్న వనరుల కంటే కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమకు ఎన్నోవనరులు,అవకాశాలు,సౌకర్యాలు ఉన్నాయి.

also read :-మేడారం జాతర హుండీల లెక్కింపుఆరంభం

అన్ని వనరులు ఉన్న బయ్యారంలో కేంద్రం ప్రభుత్వ రంగ పరిశ్రమలు నెలకొల్పాలని,ఈ ప్రాంతంలోని ఆదివాసి గిరిజన పేద వర్గాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఇక్కడున్న ఇనుప ఖనిజాన్ని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వం వినియోగించుకోవడానికి తక్షణమే ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచెల అన్ని రకాల ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు. బయ్యారం మండల కేంద్రంలో ఊక్కు నిరసన దీక్ష ను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.

నాయకులు ఈ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మానుకోట జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు, డోర్నకల్ టిఆర్ఎస్ యువజన నాయకులు డి ఎస్ రవి చంద్ర,డి ఎస్ రామ్ సింగ్, బయ్యారం మండలం ఎంపీపీ మౌనిక, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & వైస్ ఎంపీపీ తాత గణేష్ , ఉపాధ్యక్షులు తిరుమల ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి గౌడ్ ,టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బుచ్చి రెడ్డి , బయ్యారం గ్రామ సర్పంచి దళసరి కోటమ్మ ఎంపీటీసీలు, మండల నాయకులు యూత్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.