బీరు సీసాలతో కొట్టి.. టీఆర్ఎస్ నాయకుడి హత్యకు యత్నం
—మానుకోటలో మరో మర్డర్‌కు ప్లాన్
—కలకలం రేపుతున్న ఘటన
(మహబూబాబాద్- విజయం న్యూస్);-
హబూబాబాద్ పట్టణంలో మరో టీఆర్ఎస్ యువ నాయకుడిపై సోమవారం హత్యాయత్నం జరిగింది. నెల రోజులు తిరగాక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహబూబూబాద్ టీఆర్ఎస్ యూత్ టౌన్ జనరల్ సెక్రటరీ బోగ రవిచంద్ర పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం ఆయన శంకరన్న కాలనీకి వెళ్తుండగా.. అతడిపై కొంతమంది దాడి చేశారు. చాతిపై బీరు సీసాలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన రవిచంద్రను మహబూబూబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
also read :-నేటి నుంచి గార్లఒడ్డు లో బ్రహ్మోత్సవాలు.
భూ తగదాలే కారణమా..?
రవిచంద్ర హత్యా యత్నంపై భూ తాగదాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవిచంద్రపై న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన పెద్ద చంద్రన్న వర్గీయులు దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. శంకరన్న కాలనీ విషయంలో ఆధిపత్యం కోసం దాడి జరిగినట్లు తెలుస్తోంది. భూ తగాదాల నేపథ్యంలోనే రవిచంద్ర న్యూడెమోక్రసీ వీడి టీఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.