బెల్లంపల్లి భూ కంపం..
స్వల్పంగా కంపించిన భూమి
— భయంతో బయటకు పరుగులు తీసిన జనం
— మంచిర్యాల జిల్లాలో వారంరోజుల్లో ఇది రెండవ సారి
(బెల్లంపల్లి-విజయంన్యూస్)
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో ఆదివారం భూకంపం వచ్చింది.. భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనం భయంతో ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జిల్లాలోని బాబుక్యాంఫ్, షంషీర్ నగర్, లక్షిట్ పేట్ తదితర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. 3 సెకండ్ల పాటు స్వల్పంగా కంపిoచిన భూమితో జనం భయం తో ఇండ్ల ల్లో నుండీ బయటకి పరుగులు తీశారు. ఏం జరిగిందో రెండు నిమిషాలు ఎవరికి అర్థం కాలేదు. ఆ తరువాత భూకంపం వచ్చిందని తెలుసుకుని, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో జనం ఊపిరిపిల్చుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది.
also read :- 14మంది మావోయిస్టులు లొంగుబాటు
