Telugu News

బస్తీ దవాఖానాలో మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి పువ్వాడ

34వ డివిజన్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

0
బస్తీ దవాఖానాలో మెరుగైన వైద్యం అందించాలి:మంత్రి పువ్వాడ
== 34వ డివిజన్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, మే 6(విజయంన్యూస్):
 బస్తీలోని పేదలకు ప్రతి నిత్యం మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లోని  34వ డివిజన్ లో రూ. 27.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను, యోగ కేంద్రంలను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి, పేదవారికి ఉచిత వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. కార్పొరేట్ స్థాయికి మించి ప్రభుత్వం వైద్య సేవలు, చికిత్సలు, శస్త్ర చికిత్సలు ఆందిస్తుందని ఆయన తెలిపారు. పేదలు, సామాన్యుల సౌకర్యార్థం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని అధునాతన సేవలు అందిస్తుందని వివరించారు. ప్రజలు ప్రభుత్వ వైద్యంను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు.
     ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్న సేవలన్ని బస్తీ దవాఖానాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు వారి నివాస ప్రాంతాల్లోనే అందించాలని ప్రభుత్వం బస్తీ దవాఖానాల ఏర్పాటు చేసిందన్నారు. దవాఖానాల్లో అన్ని రకాల సేవలు ఉచితంగా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.    ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. మాలతీ, స్థానిక కార్పొరేటర్ రుద్రగాని శ్రీదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.