Telugu News

పొంగులేటి జాగ్రత్త..నోరు ఆదుపులో పెట్టుకో : బీఆర్ఎస్

ఎంపీగా గెలిచి ఖమ్మంకు ఏం చేశావ్

0

పొంగులేటి జాగ్రత్త..నోరు ఆదుపులో పెట్టుకో : బీఆర్ఎస్

==  ఎంపీగా గెలిచి ఖమ్మంకు ఏం చేశావ్

== ఒక్క శిలాఫలకమైనా చూపిస్తావా..?

== జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో చెప్పండి

== చర్చకు సిద్దమా..? ఎక్కడి రమ్మంటారు..?

== పొంగులేటి, కాంగ్రెస్ నేతలపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, ఏ నాడు కూడా ఖమ్మం అభివృద్ధి పై మాట్లాడని పొంగులేటి, జిల్లా అభివృద్ధి ప్రధాతైనా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమ్మర్శలు చేయడం తగదని, ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. గురువారం ఖమ్మం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ , నాయకులు ఆకుల మూర్తి, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, షేక్ షేకీన, తోగరు భాస్కర్, ఉపేందర్ పాల్గొని మాట్లాడారు.

allso read- నాలుగేళ్లలో నలుదిక్కుల అభివృద్ది: మంత్రి పువ్వాడ 

ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అభివృద్ధి కీ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. మీరు చేసినది ఏమి ఐనా ఉంటే చెప్పుకోండి…. మా మంత్రి అజయ్ కుమార్ పై అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తే సహిచబోమని స్పష్టం చేశారు. మీరు ఏమి చేస్తారో చెప్పుకోండి, మా పార్టీ పై ఆరోపణలు చేయడం ఎందుకని అన్నారు. జిల్లాలో 10కీ 10ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాం అని చెప్పటడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాము అంటున్నారు.. మీ హయంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భావితరాలకు మేలు జరిగే విదంగా అభివృద్ధి కార్యక్రమలు  చేపడుతుందన్నారు.

మీరు అధికారంలో ఉన్నప్పుడు మున్నేరు, గోళ్ళపాడు చానల్ సమస్య ను ఎందుకు పరిష్కరించలేకపోయారు, ప్రజల గురుంచి ఎందుకు ఆలోచించలేదన్నారు. మీకు నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మీరు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జిల్లా నలుమూలల సీఎం కేసీఆర్ చొరవతో, మంత్రి పువ్వడా అజయ్ కుమార్ కృషితో 9ఏళ్లలో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కి మంత్రి పువ్వాడ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.  అజయ్ కుమార్  పై అసత్య ఆరోపణలు, అబద్ధాలు ప్రచారం చేస్తే  రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆకుల మూర్తి మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధోరణి మొత్తం వ్యాపార ధోరణి ఉంటుందన్నారు. ఆయన గురించి వెబ్ సిరీస్ తీయవచ్చని, ప్రజలు నవ్వుకోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.

allso read- అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

నేను ఒక్కప్పుడు ఆయన అనుచరుడినే.. ఆయన అసలు స్వరూపం చూశాకే నిజం తెలిసిందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దూరం పెట్టిందో అందరికీ తెలుసన్నారు. ఉన్న పార్టీలోనే పార్టీ అభ్యర్థులు ఓడించాడని, అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తాడో తెలుసా..? అని పశ్నించారు. ఇప్పటికీ ఆయనకే స్పష్టత లేదు. ఖమ్మంలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాదని అన్నారు. మీ వ్యాపార కోసం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు. ఆత్మీయ సమ్మేళనాలలో ప్రకటించిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటో పొంగులేటి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పొంగులేటి ఎక్కడ పోటీ చేసిన ఓడించడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

== పొంగులేటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : బచ్చు విజయ్

గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండింస్తున్నామని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి మీరు చేసిన నాసిరకంగా కాంట్రాక్టు పనుల పై మీ తమ్ముడు విజిలెన్స్ కు పిర్యాదు చేసాడని అన్నారు. ఎన్నో అక్రమాలకు పాల్పడిన మీరు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ పై ఆరోపణలు చేయడం గురువిందా సామెత గుర్తుకు వస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తున్నాము…. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎంత కుంభకోణం చేశారో తెలుసా..? అని అన్నారు. మీరు బ్యాంక్ లను మోసం చేసిన దొంగలు, రౌడీ షీటర్లను వెంట పెట్టుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. మంత్రి పువ్వాడ పై అసత్యాలు ఆరోపణలు చేస్తే రానున్న రోజుల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

allsoread- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?