Telugu News

భద్రాద్రి రాములోరి కళ్యాణంకు భక్తుల అనుమతి

స్పష్టం చేసిన దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

0

భద్రాద్రి రాములోరి కళ్యాణంకు భక్తుల అనుమతి
== స్పష్టం చేసిన దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
== వైభ‌వంగా మ‌హోత్స‌వాలను జరపాలని ఆదేశం
== భక్తుల నడుమ శ్రీరామనవమి వేడుకలు
== ఈ ఏడాది ఘ‌నంగా ఉగాది వేడుక‌లు జరపాలని ఆదేశించిన మంత్రి
== కల్యాణవేడుకలకు అనుమతినివ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు
(భద్రాచలం-విజయం న్యూస్);-
భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో తీపివార్తను ప్రకటించింది. కోవిడ్-19 కారణంగా రెండేళ్ల పాటు భక్తులు లేకుండా రాములోరి కల్యాణం జరిపించిన దేవదాయశాఖ, ఈ ఏడాది భక్తులకు అద్భుతమైన శుభవార్తను ప్రకటించింది.. ఈ సారి భద్రాచలంలో జరగబోయే శ్రీసీతారామచంద్రస్వామి కళ్లాణమహోత్సవానికి భక్తులను అనుమతిస్తూ తెలంగాణ దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా మంగళవారం దేవదాయశాఖ కమీషనర్ నుంచి భద్రాచలం ఈవో శివాజీకి లేఖను పంపించారు.

also read;-ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి ఉద్యగం లోకి తీసుకొంటాము

ఈ మేరకు ఈ వో శివాజీ మంగళవారం విలేకర్లకు పత్రిక ప్రకటన ద్వారా సమాచారం అందించారు. ఆ లేఖలో సారాంశం ఇదే. ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి క‌ళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వ‌హిస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఎప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాల‌ని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ కు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాల‌న్నారు.

also read;-మరో మైలురాయిని అధిగమించిన అశ్విన్‌

ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లను నిర్మించాల‌న్నారు. మ‌రోవైపు ఏప్రిల్‌ 2న శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్ర‌భుత్వ ఆద్వ‌ర్యంలో పంచాంగ శ్రవణం కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లుదేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. గత రెండు సంవత్సరాలు కొవిడ్‌ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోనే కోవిడ్ నిబంధనలతో శ్రీరాముని కళ్యాణ వేడుకల‌ను, నిరాడంబ‌రంగా పంచాంగ శ్రవ‌ణ కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించామ‌ని, ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కనులపండువలా భక్తుల సమక్షంలో నిర్వహించనున్న‌ట్లు వెల్ల‌డించారు.
== భక్తుల హర్షం
దక్షణ అయోధ్యగా పిలవబడే భద్రాద్రిరామయ్య కల్యాణ మహోత్సవంకు భక్తులను అనుమతించడం పట్ల రామయ్య భక్తులు, హిందుపరిషత్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల పాటు భక్తులు లేకుండా చాలా నిరాండబరంగా రాములోరి కల్యాణమహోత్సవాలు జరిగాయని, ఎన్నోఏళ్ల తరువాత భక్తులు లేకుండా జరిగిన పరిస్థితి నేలకొందని భక్తులు తెలిపారు. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత మళ్లీ తిరిగి భక్తులను రాములోరి కల్యాణమహోత్సవానికి అనుమతీవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తులకు సరిపడ టిక్కెట్లను ముందుగానే ఆన్ లైన్ లో పెట్టాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. రెండేళ్ల తరువాత రాములోరి కల్యాణ వేడుకలకు భక్తులకు అనుమతులు ఇస్తున్న తరుణంలో పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.