Telugu News

భద్రాద్రి అధ్యయనోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి….

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు మంత్రి ఆహ్వానం ......

0

భద్రాద్రి అధ్యయనోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…..
వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు మంత్రి ఆహ్వానం ……
భద్రాద్రిలో జనవరి 3 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు…..
(చండ్రుగొండ -విజయం న్యూస్ ):-

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కు రావాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఆహ్వాన పత్రిక ను మంత్రి అందజేశారు… మంత్రి అల్లోల కు వేద పండితుల ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు…

అనంతరం మంత్రి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవా ఉత్సవ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జనవరి 12 న తెప్పోత్సవం, 13 ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, తదనుగుణంగా చేయాలని మంత్రి ఆదేశించారు. కోవిద్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను చేయాలని, భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు…

also read:-ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కల్పించినది కాంగ్రెస్ పార్టీ : భట్టి విక్రమార్క

 

please subscribe this chanel smiling chaithu