Telugu News

భానుడి భగభగలు-జనం ఉక్కిరి బిక్కిరి

అల్లాడుతున్న మూగజీవాలు

0

భానుడి భగభగలు-జనం ఉక్కిరి బిక్కిరి

అల్లాడుతున్న మూగజీవాలు

ఏనుకూరు మే 3(విజయం న్యూస్):
భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం భయాందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. తాజాగా శుక్రవారం 46 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనట్లు సమాచారం.చిన్నారులు వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది.మరోవైపు మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి.ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి.తాగేందుకు నీరు దొరక్క నానా అవస్థలు పడుతున్నాయి.మూగజీవాలకు నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి:- ఏన్కూరు లో హోం ఓటింగ్ ప్రారంభం