Telugu News

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి: ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి

- నటసార్వభౌముని కి ఘన నివాళి

0

ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి: ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి
– నటసార్వభౌముని కి ఘన నివాళి
(ఖమ్మం-విజయంన్యూస్)
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, నవరసాలను అలవోకగా పండించగల తారక రాముడు నందమూరి తారక రామారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించాలని ఖమ్మం పౌర సమితి అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం స్టేషన్ రోడ్ లోని పౌర సమితి కార్యాలయంలో పౌర సమితి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

also read :-పేదోళ్ళ దేవుడు- సందర్భంగా ఘన నివాళి.

ఈ సందర్భంగా పులిపాటి ప్రసాద్… ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బాల్యంలో ఎన్టీఆర్ తో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పులిపాటి మాట్లాడుతూ వెండితెర ఇలవేల్పుగా ఎంతో కాలం పాటు వర్ధిల్లి ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అశేష జనావళి మనసు దోచుకున్న నందమూరి తారక రామారావు నిజంగా యుగ పురుషుడేనని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర ఎరుగని అద్భుతాలను ప్రజల ముందుకు తెచ్చారని తెలిపారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు కాలం వెళ్లదీస్తున్న సమయంలో రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేసి ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా దీవెనలు అందుకున్నారని కొనియాడారు. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలతో చరిత్ర సృష్టించారని ప్రశంసించారు.

also read :-డిఎస్‌ చేరికకు లైన్‌ క్లీయర్‌

అటు చలన చిత్రరంగంలో ఇటు రాజకీయంలో వేదికపై కూడా వినూత్న పోకడలతో కొత్త ఒరవడికి నాందీ పలికిన ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పౌర సమితి కార్యదర్శి గుమ్మడవెల్లి శ్రీనివాస్, మా శెట్టి వరప్రసాద్, పోలా హరినాథ్, సిద్ధంశెట్టి శ్రీకాంత్, బొగ్గవరపు సతీష్, పారా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఉన్నం ప్రతాప్, జి ఎన్ ఎం ప్రిన్సిపల్ రాణి, బి ఎస్ సి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, సిబ్బంది కీర్తి, ప్రవీణ్, రామకృష్ణ, స్వాతి, అశ్విని, అరుణ, చంటి, సాయి శ్రీ, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.