Telugu News

ఖమ్మంల ఓటు హక్కును వినియోగించుకున్న సీఎల్పీ నేత భట్టి

** అన్ని తానై దగ్గరుండి ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్న రాష్ట్ర మంత్రి

0

ఖమ్మంల ఓటు హక్కును వినియోగించుకున్న సీఎల్పీ నేత భట్టి

** అన్ని తానై దగ్గరుండి ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్న రాష్ట్ర మంత్రి

** ముమ్మరంగా పోలింగ్

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు పోలింగ్ కేంద్రంలో ముమ్మరంగా పోలింగ్ జరుగుతుంది.. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, సీపీఐ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఓట్లేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చారు.. దీంతో ముమ్మరంగా పోలింగ్ జరుగుతుంది.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తమ పార్టీకి చెందిన ఓటర్లను దగ్గరుండి పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారు. భక్తరామదాసు కళాక్షేత్రం నుంచి నియోజకవర్గం వారీగా ఓటర్లను దగ్గరుండి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్తున్నారు. పోలింగ్ చాలా ప్రశాంతా వాతావరణంలో జరుగుతుంది.. ఇప్పటి వరకు 50 శాతంపోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కాగా మధ్యాహ్నం 1గంటలోపే ఓటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ALSO READ :-తెలంగాణ నుంచి ఏపీ వస్తున్న ఆటోలను ఆపి చెక్ చేస్తే…పోలీసులకే మతిపోయేలా చేశారు!