Telugu News

ఆడబిడ్డకు చీరేను బహుకరించిన భట్టి

లంగాణ ఉద్యమ తరహాలో మరోమారు పోరు

0

ఆడబిడ్డకు చీరేను బహుకరించిన భట్టి

== తెలంగాణ తెచ్చింది కెసిఆర్‌ కోసమా

== తెలంగాణ ఉద్యమ తరహాలో మరోమారు పోరు

== నిరుద్యోగ సంఘర్షణ సమితి పోరులో భట్టి పిలుపు

(హైదరాబాద్‌-విజయంన్యూస్):

తెలంగాణ రాష్ట్రంలోని ఓ జిల్లాలో తయారు చేసే చీరలెను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జాతీయ అడబిడ్డ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ  బహుకరించారు. పోచంపల్లిలో మహిళలు, మగ్గాలు తయారు చేసిన ప్రత్యేక చీరెలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాద్రయాత్ర చేస్తుండగా ఆడబిడ్డకు ఇవ్వాలనే ఆలోచనతో కొనుగోలు చేశాడు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అంటే సీఎం జాగీరా: ప్రియాంకగాంధీ

ఈ మేరకు సరూర్ నగర్ లో జరిగిన నిరుద్యోగ సభకు హాజరైన ప్రియాంకగాంధీకి చీరెలను అందజేశారు.  ప్రత్యేక తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబానికే ఉపయోగపడుతోందని, వారి జాగీరుగా ఆమర్చుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇదేనా మనమంతా  కోరుకున్న తెలంగాణ అని యువత ప్రశ్నించారు. సరూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ యువ సంఘర్షణ సభలో భట్టి మాట్లాడుతూ కొలువుల కోసమే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆత్మార్పణం చేసుకుంటుంటే చూడలేక.. కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. విద్యార్థులు, నిరుద్యోగులందరం ఏకం కావాలని, తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి పిడికిలి బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఆశలు, ఆశయాలు సాధించుకుందామని, కేంద్రం నుంచి పరిశ్రమలు, వివిధ సంస్థలను తెచ్చుకోవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ఠాక్రే, రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌, పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ను ప్రియాంకగాంధీ ప్రకటించారు. మృతిచెందిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులను ప్రియాంక గాంధీ అందజేశారు.

ఇది కూడా చదవండి: *కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్*