Telugu News

భట్టి ’మహా పాదయాత్ర‘

ఈనెల 27న యడవల్లి నుంచి ప్రారంభం

0

==భట్టి ’మహా పాదయాత్ర‘
== ఈనెల 27న యడవల్లి నుంచి ప్రారంభం
== నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించనున్న భట్టి విక్రమార్క
== సుమారు 50 రోజుల పాటు పాదయాత్ర
== పాదయాత్రకు భారీగా ఏర్పాట్లు
== అక్కడక్కడ బహిరంగ సభలు..?
== గ్రాండ్ గా ముగింపు సభ..?
== రూట్ మ్యాఫ్ తయారు చేస్తున్న పార్టీ నాయకులు
== ఇప్పటికే కమిటీలు ఏర్పాటు..
== హాజరుకానున్న రాష్ట్ర నాయకులు
==(ఖమ్మం ప్రతినిది-విజయంన్యూస్);-
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోసారి జనంలోకి వెళ్లేందుకు సిద్దమైయ్యారు.. స్వర్గీయ ప్రధాని రాహుల్ గాంధీ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని రాజకీయలను చేయగా, ఆయన బాటలోనే పయనించేందుకు సిద్దమైయ్యారు. పాదయాత్రతోనే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని భావించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన స్వంత నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించేందుకు పాదయాత్ర చేపట్టనున్నారు.

also read :-చండ్రుగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక….

అందుకు గాను మంచి ముహుర్తంను ఖారారు చేశారు. ఇటీవలే కొద్ది రోజుల క్రితం పాదయాత్రను నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ నిబంధనల్లో భాగంగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిద వేశారు. కరోనా నిబందనలు పూర్తి స్థాయిలో తొలిగించడంతో భట్టి విక్రమార్క పాదయాత్రకు రంగం సిద్దం చేసుకున్నారు

== ఈనెల 27 నుంచి ప్రారంభం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టనున్న పాదయాత్ర కు ముహుర్తం ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు. మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం, యడవల్లి గ్రామంలో శ్రీలక్ష్మినర్సింహాస్వామి దేవాలయంలో పూజలు చేసిన అనంతరం మహాపాదయాత్రను ప్రారంభించనున్నారు. సుమారు 50 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. ముదిగొండలో 7రోజుల పాటు కొనసాగనుండగా ఆ తరువాత ఇతర మండలాలో పర్యటన కొనసాగనుంది. చివరిగా 50రోజుల తరువాత జమలాపురంలో పాదయాత్ర ముగింపు ఉంటుంది.

== హాజరుకానున్న రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు

సుమారు 50రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరైయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్రకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్రాంతి, భోజనాలు, రాత్రి సమయంలో హాల్టింగ్ లాంటి ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. పాదయాత్ర చేస్తున్న దారుల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు, భారీ ప్లెక్సిలు, స్వాగత ఏర్పాట్లు చేయనున్నారు.

also read :-****ఎమ్మెల్సీగా పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం

అందుకు సంబంధించిన కమిటీలను కూడా భట్టి విక్రమార్క ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ పాదయాత్రకు జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు హాజరైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మండలంలో ముగింపు రోజున బహిరంగ సభలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ సభలకు జాతీయ స్థాయి నాయకులను భట్టి విక్రమార్క ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిండెంట్, ఉపాధ్యక్షులు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.