Telugu News

500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర

అభినందనలు తెలిపిన పొన్నాల, రాములు నాయక్

0

500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర

== కేక్ కట్ చేసిన భట్టి విక్రమార్క

== అభినందనలు తెలిపిన పొన్నాల, రాములు నాయక్

(జనగామ-విజయంన్యూస్)

సీఎల్పీ నేత భట్టి విక్రమార చేపట్టి గత నెల 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో జనగామ జిల్లాలో 500 కిలోమీర్లు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గం, కొర్రితండా వద్ద 500 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా  సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కేక్ కట్ చేయించారు. అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు పోరాటం విడనాడవద్దని, మీ వెనకాల కాంగ్రెస్ బలం, బలగం ఉందన్నారు.  ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించేందుకు,  ప్రభుత్వాన్ని నిలదిసేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఈ పిపుల్స్ మార్చ్ చేస్తున్నానని అన్నారు. 500 కిలోమీటర్ల పాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు, ప్రజలు, సహాకరించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: ఇది దున్న‌పోతు ప్ర‌భుత్వం : భట్టి విక్రమార్క