Telugu News

 భట్టి పాదయాత్ర కు సై

0

 భట్టి పాదయాత్ర కు సై

== టూర్ షెడ్యూల్ ఖరారు..ప్రకటించిన సీఎల్పీ నేత భట్టి

== ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజుల పాటు పాదయాత్ర

== ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి షూరు

== ప్రకటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మరోసారి పాదయాత్రకు సిద్దమైయ్యారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రను అనుసరిస్తూ హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర కు ఏఐసీసీ పిలుపునివ్వగా, ఆ యాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.

ఇదికూడా చదవండి: ఏకకాలంలో 2 లక్షలు రైతు రుణమాఫీ: రాయల 

ఇటీవలే కొద్ది నెలల క్రితం మధిర నియోజకవర్గంలో, ఆ తరువాత కూసుమంచి నుంచి సత్తుపల్లి వరకు పాదయాత్ర చేపట్టిన భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు ఇటీవలే ఏఐసీసీకి లేఖ రాయగా పాదయాత్ర చేసేందుకు ఏఐసీసీ అనుమతినిచ్చింది. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు ఆయన శనివారం అధికారికంగా ప్రకటించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాదయాత్ర టూర్ షెడ్యూల్ ను ప్రకటించారు.

== పాదయాత్ర టూర్ షెడ్యూల్ ను ప్రకటించిన భట్టి

హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేస్తున్నట్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజరహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: కోమటిరెడ్డిపై చర్య తీసుకోవాల్సిందే: సుధాకర్

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర పాదయాత్రను డిజైన్ చేశారని తెలిపారు. బోథ్, ఖానాపుర్, ఆసీఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపూరి, పెద్దపల్లి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్థన్నపేట, వరంగల్ వెస్ట్,ఘనపూర్, జనగాం, అలేరు, భువనగిరి, ఇబ్రహింపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్ లింగపల్లి, చేవేళ్ల, శాదనగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నార్కెట్ పల్లి, సూర్యపేట, కోదాడ, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వరరావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఖమ్మం నగరంలో ముగింపు సభ జరగనుంది. ఈ సభకు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంకగాంధీని ఆహ్వానించే అవకాశం ఉంది.

== సీనియర్లంతా ఏకమయ్యే అవకాశం ఉందా..?

ఒక వైపు రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హత్ అభియాన్ యాత్ర కొనసాగిస్తుండగా  మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను కొనసాగించేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సిద్దమైయ్యారు. అయితే రాష్ట్ర పీసీసీలో కొత్త, పాత అనే అంశంపై వర్గపోరులో భాగంగా సీనియర్లందరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టే పాదయాత్రకు హాజరైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, కొమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, జానారెడ్డి,  లాంటి ఎందరో సీనయర్లు ఈ పాదయాత్రకు హాజరైయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యాత్రను భారీ జన సమీకరణతో సక్సెస్ చేసి రేవంత్ రెడ్డిది ఏమి లేదు, మేము బలంగానే ఉన్నామనే విధంగా ఈ యాత్ర చూపించే అవకాశాలున్నాయి.

== బీఆర్ఎస్ పై మండిపడిన సీఎల్పీ నేత భట్టి

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బిఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.  బిఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే నేను పాదయాత్ర చేస్తున్నాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో ప్రజలకు ధైర్యం చెబుతామని అన్నారు. 2023- 24 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: మహిళ బిల్లు సంగతేంటి..?

దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి కుప్ప కూల్చిందన్నారు. ప్రధాని తన స్నేహితులైన క్రోనీ క్యాపిటల్ లిస్టులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారు.బిజెపి నాశనం చేస్తున్న ఈ దేశాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన  సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రతి గడపగడపకు తీసుకువెళ్తామని, కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గం అని ఇంటింటికి చెప్తామని అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, పిసిసి ఉపాధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శులు, పిసిసి సభ్యులు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములు చేసే పర్యవేక్షణ ఏఐసిసి నిర్వహిస్తున్నది. పాదయాత్ర లో భాగంగా మంచిర్యాల,  హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఈ బహిరంగ సభలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి మీ ముందుకు వస్తున్నాను.  మీ శక్తి మేరకు నాతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలని తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ప్రజలకు తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన అడుగులు ఉపయోగపడాలి

ఇదికూడా చదవండి: పొలవరం ముంపు గ్రామాల సంగతేంటి..?

తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అవసరాలు ఆశయాలని కాంగ్రెస్ అజెండగా మార్చుకొని నడుద్దామని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రగతిశీల వాదులు ప్రజాస్వామికవాదులు మేధావులు కళాకారులు తెలంగాణ కోసం పోరాడిన పోరాట యోధులు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జరిగే నా పాదయాత్రలో భాగస్వాములై  విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  ఈ మీడియా సమావేశంలో  ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసిసి కార్యక్రమాలు అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తదితరులు ఉన్నారు.