Telugu News

భట్టి విక్రమార్క అభిమన్యుడు కాదు అర్జునుడు

తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త చరిత్ర భట్టి పాదయాత్ర 

0

*తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త చరిత్ర భట్టి పాదయాత్ర 

== రాష్ట్రం ఇచ్చిన పార్టీ పాదయాత్ర తో తొలిసారి ప్రజల్లోకి …*

== వట్టి మాటలు కట్టిపెట్టి… పార్టీ కోసం “భట్టి” మేలు తలపెట్టిన సిఎల్పీ నేత

== పాదయాత్ర తో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ను తిరిగి దగ్గర చేసిన విక్రమార్కుడు….*

== ఒక్కడిగా బయలుదేరి…అందరినీ ఏకం చేసిన పాదయాత్ర…కాంగ్రెస్ లో ఐక్యతా రాగం…*

== అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ అభిమానుల కేరింతలు…*

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

*కాంగ్రెస్ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి చొప్పించి,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి,గతాన్ని గుర్తు చేస్తూ,మళ్ళీ తమొస్తే కలిగే ప్రయోజనాలు ప్రజలకు చేరువ చేసిన పాదయాత్ర…*

*నడుస్తూ…పార్టీని నడిపిస్తున్నాడు*

*సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ @1000 కి.మీ ల దాటి ముందుకు వెళ్తున్న సందర్భంగా* ..

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు, మధిర శాసనసభ్యులు, గౌ ” శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు గత మార్చి 16 న ఆదిలాబాద్ జిల్లా పిప్పీరి గ్రామం నుండి తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని గుమ్మడివల్లి గ్రామానికి చేరుకోవడం తో 1000 కిలో మీటర్ల దూరం పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఆయనకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ…ఈ యాత్ర జరిగిన తీరు,యాత్ర కోసం ఆయన పడిన శ్రమ,ప్రజల నుండి వచ్చిన స్పందన,తద్వారా కాంగ్రెస్ పార్టీ కలిగిన ప్రయోజనం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేద్దాం…

== *తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో సరికొత్త చరిత్ర*

అవును భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో సరికొత్త అధ్యాయం అని చెప్పొచ్చు…గత కొన్నేళ్లుగా స్తబ్ధత గా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నేరుగా విధానపరంగా పోరాటం చేసింది లేదు అనే చెప్పాలి..గతంలో సిఎల్పీ హోదాలో నే ఈ ప్రభుత్వం మీద ప్రాజెక్టుల యాత్ర అని,నకీలి విత్తనాల మీద రైతు భరోసా యాత్ర అని,అలాగే పెరిగిన నిత్యావసర,పెట్రోల్,డీజిల్ ధరల మీద సైకిల్ యాత్ర,కరోనా సమయంలో హాస్పిటల్స్ యాత్ర చేసిన భట్టి విక్రమార్క నేడు ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేయడం నిజంగా తెలంగాణ కాంగ్రెస్ లో నూతన చరిత్ర లిఖించాడు..100 రోజులు పైగా సుమారు 1300 వందల కిమి మేర ఈ యాత్ర సాగనున్నది ఇప్పటికే 1000 కి.మి పూర్తి చేసుకున్నది….

*రాష్ట్రం ఇచ్చిన పార్టీగా పాదయాత్రతో తొలిసారి ప్రజల్లోకి*

ఎవరు అవును అన్నా,ఎవరు కాదన్నా తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ,శ్రీమతి సోనియా గాంధీ గారే పార్టీ నష్టం,కష్టం ఆలోచించకుండా రాష్ట్ర ఏర్పాటు జరిగింది,ఆ సమయంలో ఉమ్మడి అసెంబ్లీ లో డిప్యూటీ స్పీకర్ గా రాష్ట్ర బిల్ ను పాస్ చేసి పంపిన ఘనత కూడా భట్టి విక్రమార్క కు దక్కుతుంది,అలాగే నేడు పాదయాత్ర తో రాష్ట్రం కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క తెలంగాణ ఇచ్చింది పేదల కోసం,సామాజిక తెలంగాణ కోసమే అని రాష్ట్ర ఏర్పాటు ఫలాలు పేదలకు దక్కాల్సి ఉన్నా అవి వారికి దక్కట్లేదు అని,కేవలం కెసిఆర్ కుటుంబం మాత్రమే ఆ ఫలాలు అనుభవిస్తూ,పేదలను భాధలు గురి చేస్తుంది అని…అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలు,ఉద్దేశ్యం గ్రామ, గ్రామాన వివరిస్తూ తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ వలనే అయినది అన్న విషయం బలంగా ప్రజల్లోకి చోపిస్తున్నాడు….

== *వట్టి మాటలు కట్టిపెట్టి…పార్టీ కోసం భట్టి మేలు తలపెట్టిన సిఎల్పీ నేత*

కాంగ్రెస్ లో నాయకత్వానికి కొదవ లేదు అలాగని భుజాన వేసుకొని చేయడానికి ఎవరూ ముందుకు రారు..వచ్చినా చివరికంటా ఆ కార్యం నెరవేర్చడం లేదు..కేవలం ఒక ప్రెస్ మీట్ లేదా ఒక ధర్నా తో ఒక్కరోజు లేదా ఒక్క పూట తో ఆ కార్యం తూతూమంత్రం గా నడిపించి ఆ వీడియోలు,ఫోటోలు తమ అనుచరవర్గంతో సోషల్ మీడియాలో నెలలు కొద్ది ప్రచారం మినహా గత రెండేళ్లుగా తెలంగాణ లో ప్రభుత్వ మీద జరిగిన పోరాటం శూన్యం అని చెప్పాలి,పేపర్ లీకేజీ,లిక్కర్ కుంభకోణం,భూముల అమ్మకాలు,హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం వంటివి అనేకం ఉన్నా నేరుగా పోరాటం చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విఫలం అయింది అనే చెప్పాలి..ఇక అటు అసెంబ్లీ లో ఉన్న సభ్యుల సంఖ్య తక్కువ అయినా వారిని అండ చేసుకొని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో సిఎల్పీ నేత వందకు వంద శాతం విజయం సాధించారు దానిలో భాగంగానే పీల్డ్ అస్టెంట్ల విషయం అయినా,రైతు రుణ మాఫీ,అయినా,పెండింగ్ ప్రాజెక్ట్స్ అయినా డబుల్ బెడ్ రూం ఇండ్ల మీద తలసాని మీద సవాల్ అయినా,హైదరాబాద్ అభివృద్ధి మీద కేటీఆర్ తో శభరి నది పరివాహక ప్రాంతం సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయం లో ముఖ్యమంత్రిని అడ్డుకున్న తీరు అధ్బుతం అక్కడ ఇక ప్రజల మధ్యగా వెళ్ళడం ,హాస్పిటల్స్ యాత్ర అయినా,ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతుల కోసం చేసిన పోరాటం అయినా,ఢిల్లీ లో రైతుల కోసం ఇందిరా పార్క్ వద్ద దీక్ష అయినా ఇలా చేసి నేడు నేరుగా ప్రజల వద్దకు పాదయాత్రగా వెళ్ళడం…నిజంగా వట్టి మాటలు కట్టిపెట్టి పార్టీ కోసం భట్టి మేలు తలపెట్టినట్లే…

== *పాదయాత్ర తో కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ను తిరిగి దగ్గర చేసిన విక్రమార్కుడు*

తెలంగాణ ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అయినా దళిత, గిరిజనులు,కొన్ని బిసి వర్గాలు పార్టీకి దూరమైన వేళ కాంగ్రెస్ నుండి ఆ వర్గాల దగ్గరకు నేరుగా వెళ్లిన నేతలు లేరు,వారి భాధలు వినడం,వారి సమస్యలు తీరుస్తాము అని హామీ ఇవ్వడం నేరుగా పాదయాత్రలో వారిని కలిసి రచ్చబండ వలె యోగ క్షేమాలు తెల్సుకోవడం తాము కాంగ్రెస్ ను దూరం చేసుకొని కెసిఆర్ మాయ మాటల నమ్మి మోసపోయామని అయా వర్గాల ప్రజలు నేడు గ్రామాల్లో చర్చలు పెడుతున్నారు అంటే భట్టి విక్రమార్క పాదయాత్ర వారి మీద ఎటు వంటి ప్రభావం చూపిందో అర్థమౌతుంది…

== *ఒక్కడు గా బయలుదేరి..అందరినీ ఏకం చేసిన పాదయాత్ర…కాంగ్రెస్ లో ఐక్యతా రాగం*

భట్టి విక్రమార్క పాదయాత్ర మొదలు పార్టీలో చాలా మందికి కొంత అసంతృప్తిగా, ఆశ్చర్యంగా కూడా అనిపించింది మొదలు పెట్టినప్పుడు చాలా అనుమానాలు అన్ని రోజులు చేస్తాడా…చేస్తే సహాకరిస్తారా అని చాలా మంది కార్యకర్తలు,రాజకీయ విశ్లేషకులు అనుమానపడ్డారు కానీ భట్టి వాటిని లెక్క చేయకుండా యాత్ర మొదలు పెట్టారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి నల్లగొండ వరకు పార్టీ పరంగా అందరూ యాత్రకు సహకరిస్తున్నారు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుండి వస్తున్న స్పందన తో వారు కూడా ఆనందం తో కలిసి ఆయనతో నడిచారు అందరి నాయకులను కలిపి భారీ బహిరంగ సభల్లో కాంగ్రెస్ క్యాడర్ చూసి ఆనందంతో కాంగ్రెస్ లో ఐక్యత వచ్చింది అనే విధంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి ఈ యాత్ర మేలు చేసింది…

== *అభిమన్యుడు కాదు అర్జునుడు అంటూ అభిమానుల కేరింతలు*

దళిత ముఖ్యమంత్రి నీ చేస్తా అని చెప్పిన కెసిఆర్ ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు గా ఉండటం తట్టుకోలేక శాసనసభ్యులను కొనేసి తనకు ఉన్న ప్రతిపక్ష హోదా మాత్రమే తియగలిగాడు కానీ ఆయన మనోధైర్యాన్ని ఏమి చేయలేకపోయాడు,కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యే లు,మంత్రులు సైతం నేడు కొందరు భట్టి విక్రమార్క పోరాటం అధి అసెంబ్లీ అయినా ఎక్కడా రాజీపడని తత్వానికి నిదర్శనం అని చెప్పడం హర్షణీయం…కెసిఆర్ తప్పులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఏకరువు పెట్టడం ద్వారా భట్టి కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావడం లో మొదటి వరుసలో ఉంటాడు…

== *ఎండనక, వానానక ఏది ఏమైనా యాత్ర కొనసాగాల్సిందే…నడుస్తూ పార్టీ నీ నడిపిస్తూ*

నాయకులు అంటే ఏసీ గదుల్లో ఉంటారు, ఏసీ కారుల్లో తిరుగుతారు అని సామాన్యులు అంటూంటారు అందుకు ఈ పాదయాత్ర పూర్తి భిన్నం ఒక అతి సాధారణ వ్యక్తి లాగా నవ్వారి మంచం, టెంట్,ఒక కూలర్ తో అందరి మధ్యలోనే ఉంటూ,తింటూ,పడుకున్నారు ఎండలు మండుతున్న, గాలి దుమారం భయపెట్టిన,వడగండ్లు విరుచకపడినా నిర్విరామంగా యాత్ర కొనసాగించిన తీరు అమోఘం,వడదెబ్బకు గురైన అక్కడే ఉండి వైద్య సేవలు పొంది తిరిగి యాత్రను కొనసాగించడం భట్టి కమిట్మెంట్ కు నిదర్శనం….

*కాంగ్రెస్ సిద్ధాంతాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి,ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టి,గతాన్ని గుర్తు చేస్తూ,మళ్ళీ కాంగ్రెస్ వస్తె ప్రజలకు జరిగే మేలు వివరిస్తూ*

కాంగ్రెస్ ఎప్పూడూ పేదవారి కోసమే పని చేస్తుంది అని,కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే పేదల సంక్షేమం అని వివరిస్తూ,కెసిఆర్ ప్రభుత్వం మాయాటలు కి మీరందరూ మోసపోయారు అని మరొకసారి అలాంటి మాటలకీ మీరు మోసపోవద్దు అని వారిని చైతన్యం పరుస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తే వారి నేరుగా జరిగే ప్రయోజనాలు వివరిస్తూ.. కాంగ్రెస్ మాట ఇస్తే అమలు చేస్తుంది అని, వారికి భరోసా ఇస్తూ గూడేలల్లో,తండాలల్లో,పల్లెల్లో,పట్నాలల్లో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ముందుకు సాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది..అందుకే పెద్ద ఎత్తున యువకులు,మహిళలు,రైతులు,కార్మికులు యాత్రకు సంఘీభావాన్ని,వారి మద్దతును తెలియజేస్తున్నారు.. *భట్టి విక్రమార్క పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఖాయం*