తుమ్మలతో భట్టి ఏం మాట్లాడారు..?
== తుమ్మలను కలిసిన భట్టి విక్రమార్క
== కాంగ్రెస్ కు రావాలని తుమ్మలను కోరిన భట్టి విక్రమార్క
== కార్యకర్తల అభిష్టమే..నా ఇష్టమన్న తుమ్మల
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కలిసిపనిచేద్దామని, తెలంగాణకు పట్టిన చీడను గోదావరిలో కలిపేందుకు కలిసి రావాలని, కాంగ్రెస్ లో చేరాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరగా కార్యకర్తలే నా నిర్ణేతలని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇదంతా భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగలపల్లి మండలంలోని తుమ్మల నివాసంలో జరిగింది..
ఇది కూడా చదవండి:- ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ‘షర్మిళ’
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన అనుచరులతో కలిసి దమ్మపేట మండలంలోని గండుగలపల్లి వెళ్లి తుమ్మలను కలిశారు. ఆయన్ను అలింగనం చేసుకున్నారు. అనంతరం భద్రాచలం రామాలయం నుంచి తెప్పించిన ప్రత్యేక చాలువతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. అనంతరం కొద్దిసేపు బేటి అయ్యి ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి రావాలని కోరినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. రాష్ట్రంలో నిజాయతీగా రాజకీయాలు, విలువలతో కూడిన నాయకులు కరువైయ్యారని, విలువలతో కూడిన నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అని కొనియాడారు. అలాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరింత బలం చేకూరుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు గెలుపుకు, రాష్ట్రంలో కొన్ని స్థానాల గెలుపుకు తుమ్మల చేరిక బలం చేకూరుతుందన్నారు. అలాంటి తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తుమ్మలను కలిసి ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 40ఏండ్లుగా తనను ఇంతటి వాడిని చేసిన అనుచరులు, మద్దతు దారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నా లక్ష్యం సీతారామప్రాజెక్టు పూర్తి చేయడమేనని అన్నారు.
ఇదికూడా చదవండి:- కందాళకు షాడోల భయం
అది నేరవేరి గోదావరి, క్రిష్ణమ్మ నీళ్లను కలిపి ఆ నీటితో జిల్లా ప్రజల కాళ్లు కడిగితే నా రాజకీయ లక్ష్యం నేరవేరుతుందని, ఆ తరువాత రాజకీయాలకు స్వస్తి చెబుతాని అన్నారు. నా కోసం ఇంత దూరం వచ్చి, కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, వారి అనుచరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
== సంచలనంగా మారుతున్న తుమ్మలతో బేటి
శనివారం ఖమ్మం నగరంలోని గొల్లగూడెం తుమ్మల క్యాంఫ్ కార్యాలయంలో తుమ్మల నాగేశ్వరరావు ను మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బేటి కాగా, తుమ్మలను కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి:- పాలేరు టిక్కెట్ కోసం రాయల దరఖాస్తు
ఈ బేటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారగా, మరసటి రోజే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దమ్మపేట మండలానికి అనుచరులతో కలిసి వెళ్లి మాజీ మంత్రి తుమ్మల ఇంటికి చేరుకుని ఆహ్వానించడం రాజకీయంలో హాట్ టాఫిక్ గా మారింది. రోజురోజుకు తుమ్మల నాగేశ్వరరావుకు మద్దతు పెరుగుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.