Telugu News

భట్టి విక్రమార్క పాదయాత్ర చరిత్రాత్మకమైనది

= భట్టి పాదయాత్ర తో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది

0

భట్టి విక్రమార్క పాదయాత్ర చరిత్రాత్మకమైనది : మల్లునందిని
== భట్టి పాదయాత్ర తో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది
== అందులో అందరికి న్యాయం జరుగుతుంది
== గ్రామములో ప్రతి ఒక్కరు పాదయాత్రలో పాల్గొనేలా చేయాలి
== మహిళలందరూ భారీగా పాదయాత్రలో పాల్గొనాలి
(ముదిగొండ, ఖమ్మం-విజయంన్యూస్)

భట్టి విక్రమార్క పాదయాత్ర చరిత్రాత్మకమైనదని,ఆయన పాదయాత్రతో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని, అందులో కచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుందని, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క తెలిపారు. ఈనెల 27 నుంచి సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ముదిగొండ మండల పార్టీ అన్ని విభాగాల శాఖల అధ్యక్షులతో సతీమణి మల్లు నందిని విక్రమార్క సమావేశం నిర్వహించారు.

also read :-ఖమ్మంలోని కమల ఆసుపత్రిలో అరుదైన వైద్యం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నారని తెలిపారు. ప్రజలందరు తమ సమస్యలను నేరుగా భట్టి విక్రమార్కకు చెప్పుకోవచ్చుని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కచ్చితంగా ప్రజలందరి సమస్యలను పరిష్కరించేందుకు భట్టి విక్రమార్క పనిచేస్తారని తెలిపారు. భట్టి విక్రమార్కకు గ్రామగ్రామన ప్రజలందరు ఘనంగా స్వాగతం పలకాలని, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పాదయాత్రను ముందుకు నడిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు,ప్రచార కమిటీ అధ్యక్షుడు మట్టా రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీటీసీలు బుల్లెట్ బాబు,పసుపులేటి దేవీంద్రము,పల్లపాటి కృష్ణ,చేరుకుపల్లి రాంబాబు,గుడిపూడి ఝాన్సీ,గుడే సాహేబ్,జెట్టి వినోద్ ,బిచ్చాల బిచ్చం మహమ్మద్ అజ్గర్,మల్లెల అజయ్,కందిమళ్ల వీరబాబు,చిమ్మసర్తి ఎల్లయ్య,పందిరి అంజయ్య,తాటికొండ రమేష్,ఉసికెల రమేష్, పిల్లొట్ల రాఘవ,ఎంపీటీసీలు, ధమ్మాలపాటి సరస్వతి,తాటికొండ విజయ,కుక్కల వెంగళరావు సర్పంచ్ గుగులోత్ క్రాంతి,వాకదాని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు….