Telugu News

భట్టి విక్రమార్క త్వరగా కోలుకోవాలి: జావిద్

ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

0

భట్టి విక్రమార్క త్వరగా కోలుకోవాలి: జావిద్

👉🏻 పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

👉🏻 ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రజా సమస్యలు తెలుసుకుంటూ   సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా నుండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. అయితే తీవ్ర ఎండలు దృష్ట్యా మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతకు గురి కావడంతో డాక్టర్లు సలహా మేరకు భట్టి విక్రమార్క పాదయాత్ర స్వల్ప విరామం ఇచ్చారు. ఆయన త్వరగా కోలుకోని తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకుంటూ శనివారం ఖమ్మం నగర కాంగ్రెస్ ఆధ్యర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇది కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధకడు విక్రమార్కుడు: జావిద్

అందులో భాగంగా నగరంలో 9వ డివిజన్ రోటరీ నగర్ లో రాజరాజేశ్వరి గుడిలో డివిజన్ అధ్యక్షులు  దొడ్డా ప్రవీణ్, ఐదో డివిజన్ లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ సతీమణి హిందూమతి మాట్లాడుతూ..నిరంతర శ్రామికుడు ప్రజల కోసం పరితపించే మనిషి ప్రజల మధ్య తిరుగుతూ ఉన్న భట్టి విక్రమార్క అస్వస్థతకు గురికావడం బాధాకరమని అన్నారు. భగవంతుడు వారికి ఆయురారోగ్యలు ప్రసాదించాలని త్వరగా కోలుకుని ప్రజల మధ్య కు రావాలని భగవంతుని కోరుతున్నట్టు తెలిపారు. అంతే కాకుండా చర్చిలలో, మజీద్ లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి: ఎండీ జావిద్

ఈ కార్యక్రమంలో  రెండో డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు వారి సతీమణి  శారద ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దామ స్వరూప ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ ఏలూరి రజిని  దొడ్డ నాగమణి   కొంటెముకల హైమావతి రఘునాధపాలెం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంటెముక్కల నాగేశ్వర్ రావు  ఖానాపురం హవేలీ ఇంచార్జ్  కిలారు అనిల్ 9వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ చావా హనుమంతరావు  9వ రోజు ఇంచార్జ్ రావులపాటి నిఖిల్ సంతోష్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లమల సత్యంబాబు అజయ్ బాబు గోపి ఖమ్మం నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏలూరు రవికుమార్ సాయి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు