చీరలు కొన్న భట్టి విక్రమార్క.. ఎవరి కోసం
చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న భట్టి విక్రమార్క
చీరలు కొన్న భట్టి విక్రమార్క.. ఎవరి కోసం
== ప్రియాంకగాంధీకి బహుకరించాలని ఖరీదు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
== పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 51వ రోజు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమైన సీఎల్పీ నేత భట్టి
== చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న భట్టి విక్రమార్క
== బిఆర్ఎస్ పరిపాలనలో చేనేతకు అందుతున్న ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల గురించి అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్వి ప్రియాంక గాంధీకి పోచంపల్లి చీరలను బహుకరించాలని నిర్ణయించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ చీరలను కొనుగోలు చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 51వ రోజు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బిఆర్ఎస్ పరిపాలనలో చేనేతకు అందుతున్న ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆత్మహత్యలు లేని తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం: భట్టి విక్రమార్క
ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని మూడేళ్లుగా వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన చేనేత కార్మికుల మాటలు విని చలించిపోయిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన చేనేత కార్మికుల మాటలు విన్న భట్టి విక్రమార్క వారి మాటలకు చలించిపోయారు. చీరలు తయారు చేయడానికి చేనేత కార్మికులు పడేటువంటి శ్రమ, చీరలు తయారు చేసే మగ్గాలను, నేతన్నలు నేసే విధానాన్ని ప్రత్యక్షంగా వాటిని నేస్తూ పరిశీలించారు. పెద్ద ఎత్తున గుమ్మిగూడిన చేనేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేనేత రంగాన్ని బ్రతికించాలని భట్టిని వేడుకున్నారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్కు విడదీయని అనుబంధం ఉందని చెప్పిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మూడు రంగుల జెండాలో మధ్యలో ఉన్న చరకానే దీనికి సజీవ సాక్ష్యం అని ఉదహరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పోగొట్టడానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి చేనేత స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని, దీని ద్వారా నిరుద్యోగ సమస్యను కొంతమేరకు తగ్గించవచ్చు అని సీఎల్పీ నేత భట్టి చెప్పారు.
ఇది కూడా చదవండి: నయీం డైరీ ఏమైంది?: భట్టి
హైదరాబాద్ సరూర్నగర్ లో ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తున్న యువ సంఘర్షణ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ప్రియాంక గాంధీకి పోచంపల్లి చేనేత కార్మికులు నేసిన చీరలు బహుకరించడానికి సిల్క్ చీరలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖరీదు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోచంపల్లి చీరలను కొనుగోలు చేయడం తమ వృత్తిని ప్రోత్సహించినట్లుగా భావిస్తున్నామని అక్కడి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.