Telugu News

కేంద్రం మీద యుద్ధమంటే ఏమిటి కేసీఆర్ : భట్టి విక్రమార్క

** ఖమ్మంలో కదంతొక్కిన కాంగ్రెస్

0

కేంద్రం మీద యుద్ధమంటే ఏమిటి కేసీఆర్ : భట్టి విక్రమార్క
** ఖమ్మంలో కదంతొక్కిన కాంగ్రెస్
** ధరల నియంత్రణలో కేంద్ర, ర్రాష్ట్రప్రభుత్వాలు విఫలైయ్యాయి
** బీజేపీ చెప్పిందే కేసీఆర్ అమలు చేస్తాడు
** కాంగ్రెస్ బలపడుతుందనే ఆలోచనతోనే కేంద్రం కేసీఆర్ తో యుద్దం అని చెప్పిస్తోంది
** డ్రామాలో ఒక భాగమే కేసీఆర్ పోరాటం
** రైతులను నిలువునా మోసం చేసింది బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు
** పేదల రక్తం తాగుతున్న ఈ రెండు ప్రభుత్వాలకు ప్రజలే బుద్ది చెప్పాలి
** ఖమ్మంలో పాదయాత్ర సందర్భంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క
(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్)

బీజేపీ పై యుద్దమంటే ఏంటో సీఎం కేసీఆర్ ప్రజలకు వివరించి చెప్పాలని, యుద్దమంటే రైతుల కోసమా..? కాంగ్రెస్ ను తొక్కడం కోసమా..? బీజేపీని లేపడం కోసమా..? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై తీవ్రంగా ద్వజమెత్తారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రప్రభుత్వం అమలు చేస్తోంది, అసెంబ్లీలో వ్యతిరేకించి పార్లమెంట్ కు పంపించాలని కోరితే పారిపోయిన సీఎం కేసీఆర్, రైతుల అన్యాయం జరిగిందంటూ లబోదిబోమంటు రాజకీయ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్,డీజీపీ, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

ఈ పాదయాత్రకు ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచకపడ్డారు. కేంద్రానికి అవసరమైనప్పుడు సహాయం చేస్తూ అవసరం లేని సమయంలో కేంద్రంపై యుద్దం చేస్తాం.. థర్డ్ ప్రంట్ తీసుకోస్తాం, ఢిల్లీలో చక్రం తిప్పుతామని ఉత్తర ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల నుంచి కేంద్రంపై యుద్దం అని చెబుతున్న సీఎం కేసీఆర్, ఏనాడు యుద్దం చేయలేదేందుకో ప్రజలకు చెప్పాలని సూచించారు. పార్లమెంట్ లో బలం కావాల్సినప్పుడు కేంద్రానికి మద్దుతు తెలుపుతున్న సీఎం కేసీఆర్, ఎన్నికల ముందు బీజేపీ పై ధామ్ ధూమ్ చేస్తాడని, ఆ తరువాత మళ్లీ ఢిల్లీ పోయి బీజేపీ మంత్రుల వద్ద మోకరిల్తారని ఆరోపించారు. ఇదంతా డ్రామాలో ఒక భాగమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న సమయంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు డ్యామెజీ వస్తుందని, అందుకే ఆ రెండు పార్టీలు గూడుపుఠానై కావాలనే యుద్దం అంటూ ఉత్తరమాటలు చెబుతున్నారని ఆరోపించారు. బీజేపీ చెప్పిందే కెసిఆర్ అమలు చేస్తాడని అన్నారు. బీజేపీ రూట్ మ్యాఫ్ ఇస్తే కేసీఆర్ కారు బయలుదేరుతుందని, లేకుంటే ఫామ్ హౌజ్ కే పరిమితమవుతుందన్నారు.


** ధరల నియంత్రణలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ధరల నియంత్రణ లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైయ్యాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వలనే పెట్రోల్,డీజిల్,గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినవని అన్నారు. ప్రజల మీద ఈ ప్రభుత్వాలు కక్ష కట్టునట్లుగా పేదల రక్తం తాగుతున్నాయని దుయ్యబట్టారు. చట్టాల మార్పులతో ప్రభుత్వాలు దళారులకు లాభం చేకూరుస్తున్నాయని, నాడు ప్రపంచ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు అధికంగా ఉన్నా తక్కువ ధరలకే పెట్రోల్,డీజిల్ ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందజేసిందని గుర్తు చేశారు.

allso read :- పొమ్మనలేక..? ** ఆ పని చేసింది ఆయనేనంటా..? అందరి నోట అదేమాట

కానీ నేడు క్రూడాయిల్ ధర అత్యంత కనిష్టంగా ఉన్నా పన్నులతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పేదల నడ్డివిరుస్తున్నాయని ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించేంత వరకు ఈ పోరాటం చేస్తామని, రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ యాత్ర చేస్తున్నామని, భవిష్యత్ లో కూడా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గిస్తాము అన్నారు.
** ధాన్యం కొనేంత వరకు రెండు ప్రభుత్వాలను వదలం : భట్టి
యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని, కొనుగోలు చేసే వరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను వదిలే ప్రస్తక్తే లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రం యాసంగిలో వరి వేయొద్దు మేము కొనడం జరగదు అని స్పష్టంగా చెప్పిన సీఎం కేసీఆర్, మరి మీరు మీ,మంత్రులు, మీ ఎమ్మెల్యేలు,ఎంపీలు అందరూ వరి వేయొద్దు పంట మార్పిడి అని కేంద్రం చెప్పిందే నువ్వూ చెప్పుకుంటూ ఏమని యుద్ధం చేస్తాన్నావు అర్థం కావడం లేదని అన్నారు. ఢీల్లీలో కేంద్రం చెప్పిందే రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నాడని, అక్కడ వారు ధాన్యం వద్దు అంటే ఇక్కడ ఈయన వద్దు అంటున్నాడని, యుద్ధం చేయడం అంటే రైతులను వరి పంట వేయమని చెప్పాడమేనా..? అని ప్రశ్నించారు. రైతుల వేసిన పంటను రాష్ట్రం కొనాలి ఆ ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుండి ఎందుకు కొనదో అప్పుడు కేంద్రం మీద పోరాటం చేసి వారి మెడలు వంచి కొనిస్తే అది యుద్ధమంట్టారే తప్ప, కేంద్రం ఏం చెప్పమంటే అది రాష్ట్రంలో చెప్పి కేంద్రంపై యుద్ద చేస్తామనడం సిగ్గుగా లేదా..? అని వ్యాఖ్యనించారు. దమ్ముంటే కేంద్రం ప్రభుత్వం దిగివచ్చే వరకు రోడ్డుపైకి వచ్చి విరామం లేకుండా పోరాటం చేయాలని, లేకుంటే ఇవ్వి ఉత్తర కుమారుడి మాటలగానే ప్రజలు అభివర్ణిస్తారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన చెప్పింది చేస్తే మన నోట్లో మనమే మన్నుకొట్టుకున్నట్లేనని అన్నారు.

all so read :- బాంచెన్ కాల్మొక్తా… గ్రామాన్ని అభివృద్ధి చేయండి..!

రైతులందరు తెలివిగా ఆలోచించి ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరుబాట పట్టాలని, రైతుల పక్షాన కాంగ్రెస్ కోట్లాడి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు ఎం.డీ.జావిద్,  ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, జిల్లా నాయకులు రామదాసునాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామసహాయం మాదవిరెడ్డి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొడ్డ సౌజన్య, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్ష్డు ఉదయ్, కార్పోరేటర్లు, వివిధ మండల కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరైయ్యారు.

also read :- బొల్తా పడిన బస్సు.. 8మంది మృతి