Telugu News

భోగబోభాగ్యాల ‘భోగి’

%% నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ

0

భోగబోభాగ్యాల ‘భోగి’

%% నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ

%% మూడు రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించనున్న ప్రజలు

%% సొంతూళ్లకు ప్రజలకు

%% ఇంటింట గుమగుమలు

%% చిన్నారుల పతంగుల సందడి

%% ముగ్గుల సందడ్లలో మగువలు

%% జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి

%% కరోనా సమయంలో జాగ్రత్తలు అవసరమని చెబుతున్న వైద్యులు

 

సంస్కతి, సంప్రధాయాల సమ్మేళనం.. సంబురాల సంక్రాంతి… రైతు ఇంట ధాన్య సిరులు.. వీధివీధిన రంగవల్లులు.. నింగి నిండా పంతంగులు..హరిదాసుల కీర్తనలు.. బసవన్నల విన్యాసాలు.. భోగిమంటల వెచ్చదనం.. పిండివంటల కమ్మదనం, మూడ్రోజుల ముచ్చటైన వేడుక… తెలుగు లోగిళ్ల కన్నుల పండుగ.. ఇవ్వన్ని కలగలిపితేనే వచ్చే సంక్రాంతి పండుగ.. అలాంటి సంక్రాంతి వేడుకలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షూరు అయ్యాయి.. మొదటిగా భోగి, రెండవ రోజున సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగలను మూడు రోజుల పాటు అద్భుతంగా, అందరి ఇంట సంతోషసమయంలో జరిగే అందమైన పండుగ సంక్రాంతి.. ఈ పండుగను జరుపుకునేందుకు జిల్లా ప్రజలు సర్వం సిద్దమైయ్యారు. ఇప్పటికే ఇంటికి చేరిన ఆడబిడ్డలు.. ఇంటిముందు రంగులవల్లులతో ముగ్గులతో సందడి చేస్తుండగా, సాయంత్రం ఆరుగంటలకే భోగిమంటలతో ప్రజలు సందడి చేస్తున్నారు.. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ వేడుకలు దూరప్రాంతాలకు విధుల నిర్వహాణ కోసం, జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరకు స్వంత ఊళ్లకు, స్వంత ఇంటికి వచ్చేస్తున్నారు. మొత్తానికి మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబురం గురించి ‘విజయం’పత్రిక అందిస్తున్న అద్భుత కథనం..

సంస్కతీ సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగ రానే వచ్చింది.. చిన్న పిల్లల నుంచి పెద్ద లవరకు ముగ్గులు, పతంగులతో సరదాగా గడుపుతున్నారు.. మూడు రోజుల పుట జరిగే పండుగకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంతగూటికి చేరుకుంటున్నారు. వ్యాపారులు తమ దుకాణాల్లో సంక్రాంతి పూజలు జరిపేందుకు సిద్దపడుతున్నారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను ఆలంకరించుకునే పనిలో నిమగ్నమైయ్యారు. మహిళలు సంక్రాంతి పూజలకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో సంక్రాంతి సందడి మొదలైయ్యింది. ఇళ్లలో అరిసెలు, సకినాలు, నువ్వుల లడ్డూలు, తదితర పిండివంటల తయారీలో ఆడపడుచులు బీజీ అయ్యారు. రంగురంగుల ముగ్గులువేస్తున్నారు.

%% నేడు భోగి

సంక్రాంతి సంబరాల్లో భోగబాగ్యాలను అందించే పండుగ భోగి. సంస్కతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా భోగి పండుగను బుధవారం నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు చిన్నారులకు భోగి పండ్లు పోయడంతో వారిమీద ఏమైనా పీడ ఉంటే వదులుతుందని ప్రజల విశ్వాసం.భోగి పండ్లను పోయడం అంటే నరదష్టిని తొలిగించడమేనని మహిళలు పేర్కొంటారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని వీక్లిమార్కెట్, పెద్దబజార్, గాంధీచౌక్ తదితర ప్రాంతాల్లో రేగుపండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. కిలో రూ.80 అమ్ముతున్నారు.

%% పూజలు.. అన్నదానాలు

భోగి పండుగ రోజు శ్రీవైష్ణవాలయాల్లో గోదా రంగనాథుని కల్యాణాలను వేడుకగా నిర్వహిస్తారు. భద్రాచలంలోని రాములోరి గుడిలో, అలాగే శ్రీవెంకటేశ్వరస్వామి, రామాలయం ఇతర వైష్ణవాలయాల్లో గోదారంగనాథుని కల్యాణ వేడుకలను నిర్వహించి, భక్తులకు అన్నదానాలు చేస్తుంటారు. స్వామివారికి భక్తులు కొత్త బియ్యంతో ఓడి బియ్యం సమర్పించుకుంటారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైష్ణవాలయాలు గురువారం జరిగే కళ్యాణాలకు వేదికలను శోభయామానంగా అలంకరిస్తారు.

 

%% 15న మకర సంక్రాంతి

సంక్రాంతి అంటే గమ్యం అని అర్థం. సూర్యుడు ధనురాశి నుంచి మకరరాశి లోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణం అంటారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే శుభదినం మకర సంక్రాంతి. ఈ రోజున తెలంగాణ ప్రాంతలో ధక్షణాది జిల్లాలో నువ్వులు, బెల్లం కలిపి నువ్వుల లడ్డూలు, సకల సౌభాగ్యం కోసం సంక్రాంతి నోముచుకోవడం, చేగోడిలు, చకినాలు, పిండి వంటలు తయారు చేసుకోవడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. మకర సంక్రమణం నాడు నువ్వుల నూనెలో లక్ష్మిదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. అందుకే లక్ష్మిదేవిని పూజించి నువ్వులు లడ్డూలను ప్రసాదంగా స్వీకరించాలని అలా చేస్తే నూరు సంవత్సరాలు ఆయుష్షు కలుగుతుందని శాస్త్ర వచనం. అందుకే సంక్రాంతి పర్వదినాన్ని అతిభాగా సంబురంగా జరుపుకుంటారు..

%% 16న కనుమ

సంక్రాంతి మరుసటి రోజు కనుమ జరుపుకోవడం ఆనదిగా వస్తున్న సాంప్రదాయం. కనుమ పండుగను కల్పపు పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి ముఖ్యంగా వ్యవసాయదారుల పండుగ. ఈ రోజున గోపూజ చేయడం ఆచారం. కనుమ రోజున రైతులు తమ ఎడ్లను ఆలంకరిస్తారు. రైతన్నకు పశుసంపదతో విడదీయలేని బంధం ఉంది. పశువులకు దైవంగా భావించి పూజించడం కనుమ పర్వదినం ప్రత్యేకత. కనుమ పండుగను కూడా తెలుగు ప్రజలు అద్భుతంగా చేస్తుంటారు.

%% ఇంటింటా సకినాల పండుగ

సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ప్రజలందరు పిండివంటలపై మక్కువ చూపిస్తారు. పండుగకంటే రెండు రోజుల ముందుగానే ఇంట్లో గుమగుమల వాసన దంచికొడుతుంది. మహిళ మణులందరు పిండివంటలలో మునిగిపోతారు. సకినాలు, అప్పాలు, చేగోడిలు, గవ్వలు, బూందీలు, లడ్డూలు, కరకరలాడే కారపూస, చక్కలు(అప్పాలు) క్కువగా చేసుకుంటారు. నోరూరించే అరిసెలను తయారు చేస్తారు.

%% కోళ్లపంద్యాలు

సంక్రాంతి పండుగ అంటే మరో సంబురం కోళ్లపంద్యాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పోటీలకు ఒక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రాంతాల్లో ఈ పోటీలను ఎక్కువగా జరుపుతుంటారు. గతంలో తెలంగాణలో కూడా కోళ్ల పంద్యాలు జరుగుతుండేవి. కానీ కాలక్రమేణా ఆంధ్రప్రాంతానికే పరిమితమైయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం కోళ్ల పంద్యాలను పూర్తిగా నిషేదించారు.

%% పతంగుల సందడే..సందడి

సంక్రాంతి పండుగ అంటే మరోక స్పెషల్ పంతుంగల పండుగ. చిన్నారులు, యువకులు, పెద్దలు పతంగులతో హంగామా చేస్తారు. చిన్నా పెద్దా అందరూ కలిసి పతంగులు ఎగరేయడంలో ఉండే ఆనందమే వేరు. నలుగురు స్నేహితులు కలిసి ఓ బంగ్లాపై చేరి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని పతంగులు ఎగురవేస్తూ సందడి చేశారు. అలాగే చాలా చోట్ల గ్రౌండ్స్ లో చిన్నారులు, యువకులు పతంగులను ఎగరవేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పతంగుల పోటీలను కూడా నిర్వహించేవారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన పతంగుల ఎగరేసుడు ఇప్పడు పల్లెపల్లెకు చేరాయి.

also read;-ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లాల్ బహుదూర్ శాస్త్రి వర్ధంతి

%% అడుగడుగున దుకాణాలు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా పతంగుల వ్యాపారం కూడా అద్భుతంగా కొనసాగుతుంది. గతంలో హైదరాబాద్, పట్టణ పరిసరాల్లో చాలా తక్కువ దుకాణాల్లో పతంగులు లభించేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాల్లో కూడా పతంగులను విక్రయాలు చేస్తున్నారు. దీంతో చిన్నారులు, యువకులు పతంగులను కొనుగోలు చేసి ఎగరవేస్తున్నారు.

%% రంగురంగుల పతంగులు.. ప్రముఖుల పోటోల పతంగులు

ప్రస్తుతం మారుతున్న సమాజానికి అనుగుణంగా పతంగుల వ్యాపారులు కూడా మారిపోతున్నారు. గతంలో హిందుమతానికి సంబంధించిన పతంగులు లభించేవి. ఇప్పుడు అన్ని కులాలు, మతాలకు సంబంధించిన పతంగులు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. అంతే కాకుండా రాజకీయ నాయకులు, హీరోలు, ప్రముఖల పోటోలతో పతంగులను తయారు చేస్తున్నారు. దీంతో పతంగుల వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

also read;-★ ప్రజారవాణాకు ఆటంకంకలిగిస్తే ఉక్కుపాదం

%% జాగ్రత్తలు చాలా అవసరం

పతంగుల ఎగరవేసే విషయంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది. పతంగులను ఎగరవేసే విషయంలో చిన్నారులు పరుగులు పెడుతుంటారు. ఈ క్రమంలో రోడ్డుదాటే అవకాశం ఉంది. అలాగే విద్యుత్ తీగలకు పతంగులు తగిలి చిక్కుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో చిన్నారులు వాటిని నేరుగా తీసేందుకు ముట్టుకునే అవకాశం ఉంది. అలాగే రోడ్లు దాటే ప్రమాదం, భవనాలపై ఎగరవేసే సమయంలో కాలుజారి పడే అవకాశం ఉంది. ఎంతో ప్రమాదకరమైన పతంగుల ఎగరవేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పటికే చాలా చోట్ల విద్యుధాఘాతానికి చిన్నారులకు తీవ్రగాయాలు కావడం, డాబాపై నుంచి పడి చనిపోవడం, రోడ్డుదాటుతుండగా ప్రమాదానికి గురకావడంలాంటి సంఘటనలు జరిగాయి. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైన ఉంది.

%% కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న మహామ్మారి కరోనా పట్ల ప్రజలందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉందని వైద్యులు, ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. ప్రపంచ ముఖ్యంగా పండుగ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పల్లెలలకు, మన ప్రాంతాలకు వస్తుంటారని, వారి విషయంలో కూడకొంత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు. అలాగే పండుగ సమయంలో అందరు కలిసి సందడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, బౌతిక దూరం పాటించడం, ఇష్టానుసారంగా బయట పుడ్ తినకపోవడం లాంటివి చేయాలని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా సమయంలో కూడా సంక్రాంతి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు చెబుతున్నారు