ఖమ్మం రూరల్ ల్లో బీఆర్ఎస్ కు పెద్ద షాక్
== దానవాయిగూడెం నుంచి వంద కుటుంబాలు కాంగ్రెస్లో చేరిక
== కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి
(ఖమ్మం రూరల్-విజయం న్యూస్):
అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ ఎస్ కు మళ్లీ పెద్ద షాక్ తగిలింది. 59వ డివిజన్ దానవాయిగూడెంకు చెందిన వంద కుటుంబాల వారు బుధవారం బీఆర్ ఎస్ ను వీడారు.
ఇది కూడా చదవండి:- ఆరు గ్యారంటీలతోనే అందరికీ సంక్షేమ పాలన: పొంగులేటి
స్థానిక నాయకులు చల్లా కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి ప్రసాద్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అందరినీ కలుపుకుపోయే శీనన్నకు మద్దతు ఇచ్చేందుకు భారీగా చేరికలు జరగడం ఆనందకరమని ఆయన అన్నారు. భారీ మెజారిటీ తో గెలిపించుకుందాo అని, సమస్యలు పరిష్కరించుకుందాం అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్లో చేరిన వారిలో గంగిసరప కొండలు, పల్లపు ఉపేందర్, ఐతబోయిన శ్రీను, కన్నం బాలకృష్ణ, పడిశాల రాజేష్, బొడ్డు రామారావు, ఇమామ్ సాబ్, వండ్ర పుల్లయ్య, వంశీ, అయితగాని రాఘవ, గోగుల నాగేశ్వరరావు, పుల్లయ్య, సతీష్, చిర్రా ఉపేందర్, తేనె రాంబాబు, బుర్ర వెంకటేష్, బొడ్డు నాగరాజు, వంశీ, నరసింహ, పల్లపు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:- తుమ్మల అసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?