Telugu News

భద్రాచలంలో  కాంగ్రెస్ కు భారీ షాక్

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

0

భద్రాచలంలో  కాంగ్రెస్ కు భారీ షాక్

== బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

== మూకుమ్మిడిగా రాజీనామాలు..

== కేటీఆర్ సమక్షంలో చేరిన ప్రజాప్రతినిధులు

== ఉలిక్కిపడిన భద్రాచలం కాంగ్రెస్

(భద్రాచలం-విజయంన్యూస్)

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అని గొప్పలు చెబుతున్న నాయకులకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఒకరి తరువాత ఒకరు షాక్ ఇస్తున్నారు.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం నుంచి కాంగ్రెస్ కు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మూకుమ్ముడి రాజీనామాలు చేశారు.. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ గూటికి పయనమైయ్యారు. కాగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో భద్రాచలంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఒక్కసారి అలజడి మొదలైంది.. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ బీఆర్ఎస్ అంటూ ముందుకు వెళ్తుండగా, బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ కాంగ్రెస్ అంటూ గ్రౌండ్ లెవల్ పై ద్రుష్టి పెట్టింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై గురి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ భారీగా చేరికలకు ప్లాన్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఇది కూడా చదవండి: మాయ మాటలు చెప్పే దొంగల్ని నమ్మొద్దు: రవిచంద్ర

భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గానికి చెందిన పదుల సంఖ్యలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి మూకుమ్ముడి రాజీనామాలు చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షులు తాండ్ర వెంకటరమణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్ళపల్లి రమేష్ గౌడ్, బోలిసెట్టి రంగారావు,  మండల కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షులు తాండ్ర నరసింహారావు, సీనియర్ కాంగ్రెస్స్ పార్టీ నాయకులు రేపాక పూర్ణ చంద్రరావు, బండారు సుధాకర్, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు గండీబెల్లి హనుమంతరావు, చర్ల ఎంపీపీ కోదండ రామయ్య, వాజేడు ఎంపీపీ శ్యామలసీత, వాజేడు జెడ్పీటీసీ పుష్పలత, సర్పంచ్ సుబ్బారావు పేట వర్షా చిన్నారావ్, సర్పంచ్ కొత్తపల్లి గుండి వేకటేశ్వర్లు, కొత్తపల్లి ఎంపీటీసీ పూసం ధర్మరాజు, నడికుడి ఎంపీటీసీ సొడి తిరుపతి రావు, ప్రగల్లపల్లి ఎంపీటీసీ మడకం రామారావు, వట్టిగుదెం సర్పంచ్ సరియం సీతారాములు, రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్వి తెల్లం నరేష్, ఎస్టీసెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఉబ్బా వేణు, అంజు పాక సర్పంచ్ మడకం నాగేంద్ర బాబు, కారం మల్లేష్

ఇది కూడా చదవండి: ఖమ్మంలో అన్ని సీట్లు  గెలుస్తాం: మంత్రి పువ్వాడ

తోటా రమేష్, కల్లూరి ఆదినారాయణ, కొమరం గణేష్, తదితర భద్రాచలం డివిజన్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తెల్లం వెంకట్రావ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా,  ఈ మేరకు హైదరాబాద్ లోని మంత్రి కేటీఆర్ నివాసంలో నూతనంగా పార్టీలోకి వస్తున్న వారందరికి కండువలు కప్పిన మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలంలో వరదలకు భయపడుతున్న ప్రజలందరికి శాశ్వత పరిష్కారంగా కరకట్టను విస్తరిస్తున్నమని, రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండబోదని అన్నారు. కచ్చితంగా భద్రాచలం ప్రజలందరికి అండగా ఉంటామని, మీఅందరికి అండగా ఉంటానని అన్నారు. భద్రాచలం నగరం, చర్ల మండలం, భద్రాచలం నియోజకవర్గ అభివద్ది కోసం పనిచేస్తామని హామినిచ్చారు. రాబోయే ఎన్నికల్లో భద్రాచలం పుణ్యక్షేత్రంలో బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఎంతైన ఉందని, అందరు కలిసి పనిచేసి గెలిపించుకోని సీఎం కేసీఆర్ కు గిప్ట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్, పినపాక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతామదుసూదన్, ఎంపీ కవిత హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్