Telugu News

మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..

కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్

0

మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..

== కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్

== బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ

== కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి

(కూసుమంచి -విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి కూసుమంచి మండలంలో బిగ్ షాక్ తగిలింది. ఆయన రైట్ హ్యాండ్ గా ఉన్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, రాజుపేట నివాసి, రాజుపేట ఎంపీటీసీ మోదుగు వీరభద్రం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్య అనుచరులైనా ఎంపీపీ బానోతు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరగా , ఈ రోజు ఎంపీటీసీతో పాటు ఉప సర్పంచ్ కూడా పార్టీలో చేరడంతో కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ బిగ్ షాక్ తగిలింది.

ఇది కూడా చదవండి:- కూసుమంచి మండలంలో కాంగ్రెస్ గూటికి వందల మంది

కూసుమంచి మండలంలోని పెరక సింగారం రాజుపేట రాజుపేట బజార్ ఎంపీటీసీ సభ్యులు రాజుపేట గ్రామ ఉపసర్పంచ్ ఉప్పల వీరభద్రం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు శ్రీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్,సి డి సి మాజీ చైర్మన్ జూకూరు గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జొన్నలగడ్డ రవికుమార్ గారు, బజ్జూరు వెంకటరెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురాం తదితరులు పాల్గొన్నారు*