పొంగులేటికి బిగ్ షాక్
== సెక్యూరిటీని తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం
== ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ
== ‘కారు‘ దిగుతాడేమోనని కక్ష్య సాధింపంటున్న పొంగులేటి వర్గీయులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి సెక్యూరిటీ కుదించి తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎంపీగా ఓటమి చెందిన నాటి నుంచి ఇప్పటి వరకు 8+8(పైలెట్ వాహనంలో కలిపి) సెక్యూరిటీ కల్పిస్తుండగా, ఇక నుంచి కేవలం 2+2 కు తగ్గింపు చేశారు. అందుకు కారణాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పైగా అసలేం జరుగుతోందో తెలియరాలేదు.అయితే ఇటీవలే జనవరి 1న ఖమ్మంలోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాధి మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరైయ్యారు. ఆ జనం రాకను చూసి ఉబ్బితబ్బుబ్బిపోయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
allso read- ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి
అధికార పార్టీలో ఉన్నాం.. ఎంపీగా టిక్కెట్ ఇవ్వకపోయిన, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోయిన ఆ పార్టీలోనే ఉన్నప్పటికి పార్టీ అదిష్టానం మనకేం చేసిందో ప్రజలందరికి తెలుసు. నాతో కలిసి పనిచేసేవారికి మరింతగా తెలుసు. అందుకే అతి త్వరలోనే అందరు అశ్ఛర్యపోయే ప్రకటన చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా.. నాతో పాటు టిక్కెట్ ఆశీస్తున్న ప్రతి ఒక్కరికి టిక్కెట్ ఇప్పించే బాధ్యత నాదేనని కచ్చితంగా పోటీ చేస్తామని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అవి కాస్త పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వద్దకు చేరినట్లు కనిపిస్తోంది. దీంతో స్పందించిన నాయకుడు సెక్యూరిటీని తగ్గించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే సెక్యూరిటీని తగ్గించడంపై పెద్ద దుమారమే లేస్తోంది.
== తెలంగాణ సర్కార్ పై మండిపడిన పొంగులేటి వర్గీయులు
నాలుగున్నరేళ్ల తన ఆవేదనను చెబితేనే అధికార పీఠాలు కదులుతున్నాయి. పొంగులేటిపై ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. పార్టీ మారుతాడేమో..! తమకు ప్రత్యర్థి అవుతాడేమో..! అనే ఆందోళన కొందరికి వణుకు పుట్టిస్తోంది. ఆ భయం తాలూకు ప్రతి చర్యలు కనిపిస్తున్నాయి. పొంగులేటి భద్రతను కుదిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శీనన్న గట్టిగా మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక రకంగా ప్రతీకారం తీర్చుకోవడం రివాజుగా మారింది. గతంలో పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి తొలగించారు. ఇప్పుడు భద్రతను కుదించారు.
allso read- వసతి గృహం నుంచి ఇద్దరు విద్యార్థునులు అదృశ్యం
అధికారం శాశ్వతం కాదు.. ఆత్మీయత, అభిమానం ముందు అవన్నీ దిగదుడిపే..! జన నేతను ఎవరూ ఏమి చేయలేరు. అయితే ఇది కచ్చితంగా రాజకీయ కుట్రలో భాగమేనని పొంగులేటి వర్గీయులు ఆరోపిస్తున్నారు. కారుదిగిపోతారేమోననే భయంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని, పొంగులేటి కి సెక్యూరిటీ అవసరం లేదన్నారు. ఆయన్ను కాపాడుకునే బాధ్యత మాపై ఉంటుందని పొంగులేటి వర్గీయులు చెబుతున్నారు.