Telugu News

ఖమ్మంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి బిగ్ షాక్..*

ఏం జరిగిందంటే..?

0

ఖమ్మంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి బిగ్ షాక్..*

== ఏం జరిగిందంటే..?

(ఖమ్మం-విజయం న్యూస్)

ఖమ్మం వైయస్సార్ తెలంగాణ పార్టీ కి బిగ్ షాక్  తగిలింది. ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ రాజీనామా చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనలో కొనసాగుతుండగా ఆమెకు బిక్షకు తగిలినట్లు అనిపించింది ఆ పార్టీ ప్రధాన నాయకుడు సుదీర్ఘకాలం కాలంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన లక్కినేని సుధీర్ ఆదివారం తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత్రి షర్మిళ కు పంపించారు.

ఇది కూడా చదవండి:- పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

*పార్టీ పరిస్థితి బాగోలేదని, ఇష్టానుసారంగా పదవులు ఇస్తున్నారని ఆరోపిస్తూ పార్టీ కి రాజీనామా చేసిన సుదీర్, మరిన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ కీ అధ్యక్షుడిగా, ఆ తరువాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేసిన సుధీర్, వైఎస్ఆర్ కుటుంబంతో విడదీయలేని బంధం ఉంది..కుటుంబ సభ్యుడిగా మెలిగిన లక్కినేని ఆ బందానికి విడ్కోలు పలికారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ

వైయస్సార్ తెలంగాణ పార్టీలు ఎలాంటి అనుభవం లేని వారిని పార్టీలోకి తీసుకుంటూ ఇస్తానుసారంగా పదవులు ఇస్తూ కోఆర్డినేటర్లుగా మండల అధ్యక్షులుగా నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని పార్టీ లైన్ దాటుతున్న వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని డబ్బులు ఈ ప్రధానంగా రాజకీయాలు చేస్తూ నటిస్తున్నారని ఆరోపించారు అంతేకాకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆ ప్రభుత్వంపై వైయస్ షర్మిల చేసిన ఆరోపణలు ఖండించారు.

వైఎస్సార్సీపీకి కోసం జగన్ కోసం పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల ఆ పార్టీపై తన సోదరుడిపై ఆరోపణ చేయడం తనకు బాదేసిందని ఆరోపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చాలా లుకలుకలు ఉన్నాయని వాటిని సర్ది చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కష్టపడి పని చేస్తున్న వారిపై ఆరోపణలు చేస్తున్నారని అనేక రకాలుగా అవమానిస్తున్నప్పటికీ పార్టీ కోసం వైఎస్సార్ కుటుంబం కోసం కొన్ని అవమానాలు భరించి కూడా పార్టీలో కొనసాగానని ఆయన తెలిపారు.