Telugu News

మట్టాదయానంద్ కు  బిగ్ షాక్

ఎస్సీ కుల దృవీకరణ పత్రం రద్దు

0

మట్టాదయానంద్ కు  బిగ్ షాక్

== ఎస్సీ కుల దృవీకరణ పత్రం రద్దు

== ఉత్తర్హులను  జారీ చేసిన జిల్లా కలెక్టర్ వి.పీ గౌతమ్

== సత్తుపల్లిలో పోటీ పై నీలినీడలు

== ఆయోమయంలో మట్టా వర్గీయులు, అనుచరులు

== దృవీకరణ పత్రం రద్దుపై  హైకోర్టును ఆశ్రయించే అవకాశం

== ప్రభుత్వ కుట్రలో భాగమేనంటున్న మట్టా అనుచరులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది.. సత్తుపల్లి నియోజకవర్గ టిక్కెట్ ను ఆశీస్తున్న మట్టా దయానంద్ కు జిల్లా కలెక్టర్ షాక్ ఇచ్చారు. ఆయనే దళితుడు కాదంటూ జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ప్రకటించారు.. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి నాయకులు వలస వెళ్తుండగా, మరో వైపు కాంగ్రెస్ నేతలకు పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు.  దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దయానంద్ వర్గీయులు, అనుచరులు ఆయోమయంలో పడిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన మట్టా దయానంద్ విజయ్ కుమార్ తండ్రి కులాంతర వివాహం చేసుకున్నారు. తండ్రి బీసీ గౌడ కులానికి చెందిన వ్యక్తి కాగా, తల్లి దళిత కులానికి చెందిన మహిళ కావడంతో ఆనాడు చట్టం చెప్పిన ప్రకారం మట్టాదయానంద్ తల్లి వారసత్వంగా ఎస్సీ దృవీకరణ పత్రాన్నిపొందారు. ఆయన చదువులతో పాటు రాజకీయ పదవులను కూడా పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

allso read- రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పువ్వాళ్ళ

కాగా అతి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్దమైన దయానంద్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు భారీగా ప్రచారం ప్రారంభించారు. ఎవరు ఊహించని విధంగా కార్యక్రమాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై మట్టా దయానంద్ గెలుపు అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ టిక్కెట్ కోసం గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించారు.

== అర్హుడు కాదని నిర్ణయించిన కలెక్టర్

మట్టా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రం పొందటాన్ని సవాల్ చేస్తూ ములుగు జిల్లా (ఉమ్మడి ఖమ్మం) వెంకటాపురం గ్రామానికి చెందిన కొడారి వినాయక రావు అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటిపడ్డారని, ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఈ మేరకు ఏప్రిల్ 9, 2021న విచారణ చేపట్టారు. అనంతరం పూర్తి స్థాయిలో దర్యాప్తుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా  వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి నివేదికల సమర్పించారు. వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ ఆదారాలు సమర్పించాలని ఆదేశించింది. కాగా మట్టా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక సమర్పించారు. కులాంత వివాహాలలో పిల్లలు ఏ కులాన్ని పొందుతారనే అంశంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులకు లోబడి మట్టా దయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాడని నిర్ణయించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ కు ఎస్సీ కుల దృవీకరణ పత్రం రద్దు చేస్తున్నట్లు ఉత్తర్హులు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాల వివాదంలో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను తమ ఆదేశాల్లో ఉటంకించిన జిల్లా కలెక్టర్.. మాట్టాదయానంద్ ఎస్సీ కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టూ, ఆయా జిల్లా శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ సమాచారం పంపించారు. దీంతో ఖమ్మం జిల్లాలో హాట్ టాఫిక్ గా మారింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మట్టా దయానంద్ పోటీ చేసేందుకు సర్వం సిద్దమవుతుండగా ఇంతలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కుల ద్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడం పట్ల మట్టా దయానంద్, ఆయన అనుచరులు ఒక్కసారిగా అవాక్కైయ్యారు. అయోమయంలో పడిపోయారు. కలెక్టర్ నిర్ణయంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా ఆయన హైకోర్టు కు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది..

== పోటీపై నీలినీడలే..?

కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మట్టా దయానంద్ కు జిల్లా కలెక్టర్ ఊహించని షాక్ నిచ్చారు. కుల ద్రువీకరణ పత్రం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో మట్టా దయానంద్ సత్తుపల్లిలో పోటీ చేసే అవకాశం లేదు. జనరల్ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉందే తప్ప సత్తుపల్లిలో పోటీ చేసే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఆయన హైకోర్టు కు వెళ్దామని చెబుతున్నప్పటికి  పోటీ చేసే విషయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఆయన భార్య రాఘమయి దళితబిడ్డ కావడంతో ఆమెను బరిలో నిలిపే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందని భావించిన మట్టా దయానంద్ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యాక్రమంలో ఆయన భార్యను తీసుకోస్తూ ప్రజలకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్లారు. దీంతో మట్టా దయానంద్ భార్య రాఘమయి కూడా సత్తుపల్లి ప్రజలకు తెలిసినాయకురాలే కావడంతో మట్టా దయానంద్ తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మట్టా దయానంద్ కులద్రువీకరణ పత్రంను రద్దు చేయడంతో ఖమ్మం జిల్లాలో రాజకీయం మరింతగా హీటేక్కిందనే చెప్పాలి.