బీహార్ లే తెలంగాణ ను నాశనం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
(తెలంగాణ విజయం న్యూస్);-
• తెలంగాణ రాష్ట్రాన్ని బీహార్ అధికారులే శాసిస్తున్నారు
• వారిని గుప్పిట్లో ఉంచుకున్న సీఎం కేసీఆర్..రాష్ట్రాన్ని దోచుకుంటున్నరు.
• కీలక శాఖల్లో బీహారీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లే ఉన్నారు.
• నీటి పారుదల శాఖ కమిషనర్ , స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, మున్సిపల్ శాఖ అరవింద్ కుమార్, ఐటీ చూసే జేయేష్ రంజన్, సందీప్ సుల్తానియా.. అంతా వీళ్ళే
also read :-అనస్థీషియా హై డోస్ హడావుడిగా ఆపరేషన్లు
• 157 మంది ఐఏఎస్ లలో ప్రతిభావంతులు లేరా?
• ఒక్కో అధికారి కింద ఐదారు శాఖలున్నాయి.
• కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయని మరోసారి రుజువైంది.
• సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కలిసే ధరణి తెచ్చారు.
• ధరణి పోర్టల్ లో మొత్తం తప్పులే ఉన్నాయి.
• ధరణి లోపాలతో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి.
• రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయి. నిన్ననే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు రియల్టర్ల హత్య జరిగింది.
ధరణి పోర్టల్లో లోపాలతోనే ఈ హత్యలు జరుగుతున్నాయి
also read;-తెలంగాణ తాగు… సాగు నీటి ప్రాజెక్టులు దేశానికే ఆదర్శం
హైదరాబాద్ చుట్టు పక్కల భూములు కాజేస్తున్నారు.
• పాత యజమానులు భూములు అమ్ముకున్నా.. ధరణిలో మళ్లీ వాళ్లకే పట్టాలిచ్చారు.
• దీంతో వాళ్లు మళ్లీ అవే భూముల్ని అమ్ముతూ.. వేల కోట్ల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారు.
• 20ఏళ్ల క్రితం ఉన్న భూ యజమానులు పేర్లు ధరణిలో వస్తున్నాయి.
• దీంతో భూమికొన్న ఓనర్లు ఆగమై హత్యలకు గురవుతున్నారు.
• జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు రజత్ కుమార్ 30 లక్షల ఓట్లు తొలగించారు.
• అందుకే ఇరిగేషన్ శాఖకు ట్రాన్స్ ఫర్ చేశారు.
• అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖను ఆగం చేస్తున్నారు.
• అరవింద్ కుమార్, మంత్రి కేటీఆర్ కలిసి బిల్డింగ్ అనుమతుల్లో ఎన్ని కోట్లు దండుకుంటున్నారో త్వరలోనే బయట పెడతాం.