***కేసీఆర్ జననం తెలంగాణ ప్రజలకు వరం : మంత్రి గంగుల కమలాకర్
**తెలంగాణ ఆస్థి కేసీఆర్, ఆయన పుట్టిన తెలంగాణ గడ్డపై పుట్టడం మన అదృష్టం
***కేసీఆర్ జననం తెలంగాణ ప్రజలకు వరం : మంత్రి గంగుల కమలాకర్
***తెలంగాణ ఆస్థి కేసీఆర్, ఆయన పుట్టిన తెలంగాణ గడ్డపై పుట్టడం మన అదృష్టం
***తెలంగాణ సాధించి 7ఏళ్లలోనే అద్భుత ప్రగతి పథంలో నిలిపిన పాలన కలకాలం కొనసాగాలి
***తెలంగాణ మాదిరే కేసీఆర్ దేశాన్ని ఏలాలి
***కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన సీఎం కేసీఆర్ జన్మధిన వేడుకలు
***మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పండుగలా వేడుకలు
***అన్నధానం ప్రారంభించి సీఎం కేసీఆర్కి 68వ జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి గంగుల కమలాకర్
***(కరీంనగర్-విజయంన్యూస్):-
కేసీఆర్ జననం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వరం అని కారణజన్ముడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మధిన వేడుకలు కరీంనగర్ లో మంత్రి గంగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ చౌక్ వద్ద అన్నధానం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఆప్యాయంగా బోజనం వడ్డించిన మంత్రి గంగుల సీఎం కేసీఆర్ కి జిల్లా ప్రజల తరుపున ముందస్థుగా 68వ జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ 60 ఏళ్ల కలైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అగ్రగ్రామిగా నిలుపుతున్నారన్నారు.
కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని కేసీఆర్ పుట్టిన గడ్డపై పుట్టడం మన అద్రుష్టమని, ఎందుకు మా గడ్డపై పుట్టలేదు అని వేరే ప్రాంతాల వారు బావిస్తారన్నారు.
also read :-దావూద్ ఇబ్రహీం సోదరి ఇంట్లో ఈడీ సోదాలు..
పిభ్రవరి 17కోసం తెలంగాణతో పాటు దేశ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలంగాణ బిడ్డ ఎదురుచూస్తారన్నారు.
7 సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని దిగ్విజయంగా అభివ్రుద్ది పథంలో తీసుకెళ్తున్నారని, సీఎం కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఈ సంతోషం నూరేళ్లు కొనసాగాలని సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలని ఆకాంక్షించారు. ఈ ప్రగతి దేశం మొత్తం చేరాలని త్వరలోనే దేశం పగ్గాలు సైతం చేపట్టి అభివ్రుద్ది సాధించాలని ఆకాంక్షించారు, కేసీఆర్ ఆయా మతాలు ప్రత్యేక పండగలు నిర్వహించుకుంటాయని కానీ అన్ని మతాలు కలిసి నిర్వహించుకొనే గొప్ప పండగ పెద్ద పండగ సీఎం కేసీఆర్ గారి జన్మధినం అని అన్నారు.
also read:-*మాకు న్యాయం చేయండి : మంత్రి హారీష్ రావును కలిసిన పాలేరు నియోజకవర్గ రైతులు
ఈ సందర్బంగా మూడు రోజుల పాటు వేడుకగా అన్నధాన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలోనూ, మండల, జిల్లా హెడ్ క్వార్టర్లోనూ నిర్వహిస్తామన్నారు. బీసీ సంఘాల తరుపున, గ్రామ, జిల్లా కార్యవర్గాల ద్వారా పండగ చేస్తామన్నారు. వేంకటేశ్వర స్వామి, అమ్మవారి ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల ప్రార్థనలు సీఎం కేసీఆర్ పై చిరకాలం ఉంటాయన్నారు..