Telugu News

కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయామ్మ.

 కాసేపటికే సృహతప్పిన చిన్నారి.. ఆసుపత్రికి తరలింపు.

0

కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయామ్మ.
 కాసేపటికే సృహతప్పిన చిన్నారి.. ఆసుపత్రికి తరలింపు.
 సిద్దిపేట జిల్లాలో సంఘటన.
(సిద్దిపేట-విజయం న్యూస్)
పాపం చిట్టి తల్లిఅంగనవాడి టీచర్, ఆయమ్మ ల నిర్లక్ష్యం పాము కాటుకు చిన్న పాప బలి అయ్యింది..తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారంలో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. ఉదయం ఇంట్లో సందడి చేసి.. అమ్మ-నాన్నలకు టాటా చెప్పి ఇంటి నుంచి అంగన్వాడీకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి సాయంత్రానికి విగతజీవిగా మారిపోయింది. మాయదారి పాము చిన్నారి జీవితాన్ని మింగేసింది.

అయితే ఇక్కడ ఆయమ్మ నిర్లక్ష్యం పాప పాలిట శాపమైంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారానికి చెందిన కామల్ల రాజు – సంతోష దంపతుల తనయ నిత్యశ్రీ ఏడాదిన్నరగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. గురువారం రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అక్కడే ఆడుకుంటున్న నిత్యశ్రీ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఎడమకాలు పాదం వద్ద రక్తం రావడాన్ని గమనించిన ఆయా ఢాకమ్మ.. కిందపడటం వల్ల గాయం అయ్యింది అనుకుని పసుపురాసి, కట్టుకట్టి అక్కడే పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత అన్నం పెట్టేందుకని చిన్నారిని లేపే ప్రయత్నం చేసింది. లేవకపోవడంతో వెంటనే ఆశా వర్కర్ అనిత చిన్నారి తల్లికి సమాచారం అందించింది. వారంతా పాపను హుటాహుటిన గజ్వేల్‌ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చికిత్సపొందుతుంది.

also read :- విద్యుత్ షాక్ తో మహిళా రైతు మృతి.