Telugu News

మోడీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య భద్రతకు నిదర్శనం

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతలకళ్యాణ్ చంద్ర

0

మోడీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య భద్రతకు నిదర్శనం ** దేశంలో 100కోట్ల డోసుల వ్యాక్సినేషన్
** కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా అందిస్తున్న ప్రధాని మోడీకి కృతజ్ఞతలు

** బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతలకళ్యాణ్ చంద్ర
(కరీంనగర్-విజయం న్యూస్)
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి, దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం కట్టుబడి , ప్రపంచంలో నే అత్యంత భారీ ఉచిత టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేటి వరకు 100 కోట్ల భారతీయులకు కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ఉచిత డోసులు అందించడం చారిత్రక మయిందని ,దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఉచిత కరోనా వ్యాక్సినేషన్ అందించడం ప్రభుత్వ పనితీరు నిదర్శనంగా నిలుస్తుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా వందకోట్ల డోసులు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్రం జనవరి 16న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను యజ్ఞంలా చేపట్టి నేటికీ వందకోట్ల డోసులు దిగ్విజయంగా పూర్తి చేయడం హర్షణీయమన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ప్రపంచంలో ఏ దేశం కూడా మోడీ ప్రభుత్వం మాదిరి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని, దేశ ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్తో పాటు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ప్రధాని మోడీ వ్యాక్సిన్ సరఫరా చేయడం గొప్ప విషయమన్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సిన్ డోసులు అందించిన దేశంగా భారతదేశం నిలిచిందన్నారు . కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషి భారతీయులందరికీ గర్వకారణమని, ఇందుకు ప్రధాని మోడీ కి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

also read:- టీవీ చూస్తూ పిల్లలు భోజనం చేస్తే ప్రమాదమే