Telugu News

బీజేపీ, బీఆర్ఎస్ పై ద్వజమెత్తిన పొంగులేటి

నామా మంత్రి అవుతారని మాజీ సీఎం ఎలా ప్రకటిస్తారు

0
బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమే : పొంగులేటి
== నామా మంత్రి అవుతారని మాజీ సీఎం ఎలా ప్రకటిస్తారు
== సమావేశంలో మండిపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
(ఖమ్మం -విజయం న్యూస్)
 బిజెపితో బిఆర్ఎస్ పొత్తు పరోక్షం కాదు ప్రత్యక్షమేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కేసిఆర్ మాటలు దీనిని రుజువు చేస్తున్నాయని కేంద్రంలో నామ మంత్రి అవుతారంటే బిజెపితో పొత్తు లేకుండా ఎలా సాధ్యమని పొంగులేటి ప్రశ్నించారు. సిపిఐ పార్లమెంటరీ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ మార్పు కోసం శాసనసభ ఎన్నికల్లో సిపిఐ, కాంగ్రెస్ కలిసి పనిచేసి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని అదే రీతిలో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం మరోమారు కలిసి పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:- దోపిడీదారి బీ జేపీ సర్కారు ను సాగనంపుదాం: నారాయణ, పొంగులేటి

కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని కమ్యూనిస్టులు ఏమి కోరుకుంటున్నారో కాంగ్రెస్కు అధికారం వస్తే అదే చేస్తుందని పొంగులేటి తెలిపారు. దేశ భవితవ్యాన్ని విదేశాలకు తాకట్టు పెడుతున్న బిజెపి రామున్ని రాజకీయాల్లోకి తీసుకు వచ్చిందని మనకు అక్షింతలు ఇచ్చి అధికారాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తుందని పొంగులేటి తెలిపారు. బిజెపిని ఓడించక పోతే దేశానికి ప్రమాదమన్నారు. ఇక 2019లో సారు కారు పదహారు అంటూ కేసిఆర్ ప్రచారానికి తెలంగాణ ప్రజలు కర్రుకాచి వాతపెట్టారని ఇప్పుడు మరోసారి వాతలు తప్పవన్నారు. రూ.1.50 లక్షల కోట్లు దోచుకుని దాని నుంచి బయటపడేందుకు రాత్రిపూట చర్చలు జరుపుతున్నారని బిఆర్ఎస్ ను పొంగులేటి విమర్శించారు. అక్రమాలు బయటపడుతున్నాయని విద్యుత్ శాఖ, నీటిపారుదల, ధరణి ద్వారా దోచుకున్న సొమ్ము బయటపడక తప్పదన్నారు. తెలంగాణలో 17కు 17 స్థానాలు సెక్యూలర్ కూటమి గెలుస్తుందని బిఆర్ఎస్, బిజెపిలను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు.