Telugu News

పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ ధర్నా.

ధరలు తగ్గించేవరకు పోరాటం చేస్తామన్న జిల్లా అధ్యక్షుడు గల్లా.

0

పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ ధర్నా.
ధరలు తగ్గించేవరకు పోరాటం చేస్తామన్న జిల్లా అధ్యక్షుడు గల్లా.
(ఖమ్మం – విజయంన్యూస్):-
పెట్రోల్ డీజిల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.., భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాచౌక్లో భారీ ధర్నా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ధర తగ్గిస్తే నేను కూడా తగ్గించడానికి సిద్ధమంటూ ప్రగల్బాలు పలికిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు  కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ లీటరు డీజిల్ పై పది పది రూపాయల చొప్పున రేటు తగ్గించి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పెట్రోలు పై లీటర్కు 40 రూపాయల చొప్పున టాక్స్ ల రూపంలో వసూలు చేస్తూ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు, వ్యాట్ రూపంలో 40 రూపాయలు చొప్పున ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ పై వసూలు చేయటం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే అని కనీసం లీటర్ డీజిల్ పెట్రోల్ పై 20 రూపాయల చొప్పున KCR ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు, కేంద్రప్రభుత్వం పన్నుల రూపంలో గతంలో 20 రూపాయల చొప్పున వసూలు చేసేదని దానిలోనే దేశ రక్షణకు, విద్య, వైద్యం, జాతీయ రహదారులు, అదేవిధంగా గా దేశ ప్రజలందరికి కూడా ఉచితంగా COVID వ్యాక్సిన్ వేసిన ఘనత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిదే అన్నారు, లీటరుపై 40 రూపాయలు వసూలు చేసే KCR ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నదని వెంటనే లీటర్ పెట్రోలు డీజిల్ పై కేసీఆర్ ప్రభుత్వం 20 రూపాయల చొప్పున ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ ప్రతాప్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, గంటేల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్యామ్ రాథోడ్, రుద్ర ప్రదీప్, మట్టా దుర్గా ప్రసాద్ రెడ్డి, మారుతి వీరభద్ర ప్రసాద్, వీరెల్లి లక్ష్మయ్య , జిల్లా ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి , నకిరేకంటి వీరభద్రం, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఉపేందర్ గౌడ్ , మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు దొడ్డ అరుణ, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవి రాథోడ్ , OBC మోర్చా జిల్లా అధ్యక్షులు వీరు గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కోటమర్తి సుదర్శన్, దొంతు జ్వాలా నరసింహారావు, కుమ్మిలి శ్రీనివాస్, లక్ష్మీనారాయణ గుప్తా , పిల్లల మర్రి వెంకట , నల్ల గట్టు ప్రవీణ్, అంకతి పాపారావు, దుద్దుకూరు కార్తీక్, బోడేపూడి రాజా, అనిత,విక్రం జాదవ్, సుగుణ, తదితరులు పాల్గొన్నారు.

 

Also read :- అసెంబ్లీలో పరిణామాలపై బాలకృష్ణ స్పందన.