Telugu News

కమ్యూనిస్టులు జోకర్లుగా తయారైయ్యారు

కమ్యూనిస్టుల పై బిజెపి నేతల ధ్వజం

0

కమ్యూనిస్టులు జోకర్లుగా తయారైయ్యారు
== కమ్యూనిస్టుల పై బిజెపి నేతల ధ్వజం
== నరేంద్రమోదీ ని అడ్డుకునే నైతిక హక్కు లేదు
== తెల్దారుపల్లిలో హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలి
== విలేకర్ల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ
ఖమ్మంప్రతినిధి, నవంబర్ 11(విజయంన్యూస్)
సీపీఎం, సీపీఐ నేతలు కమ్యూనిస్టులు జోకర్లు గా తయారు అయ్యారని, ప్రజల పక్షం అను చెప్పుకుంటూనే పాలక పక్షంతో పొత్తులు పెట్టుకుంటూ రాష్ట్రాన్ని, దేశాన్నిదోరలకు, గడీలకు తాకట్టు పెట్టేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఏ పార్టీ తో పొత్తు లేదని పోతుపెట్టుకున్నారన్నారని ఆరోపించారు.

allso read- త్వరలో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ హైవే పనులు షురూ..

హత్యా కేసు నుండి తప్పించుకునేందుకే తమ్మినేని వీరభద్రం, కునంనేని సాంబశివ రావులు కెసిఆర్ కాళ్ళ వద్ద మొకరిళ్ళారని ఆరోపించారు. సీపీఎం, సీపీఐ పార్టీలు  ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు సమస్యలపై పోరాటాలు చేసే పార్టీ లు కెసిఆర్ పార్టీ కి తొత్తు గా మారడం సిగ్గు చేటని ఆరోపించారు. దేశ ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర బాగోగుల కోసం రామగుండంలో ఎరువుల పరిశ్రమ ప్రారంభానికి వస్తుంటే సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులకు ఏం నొప్పి వచ్చిందో అర్థం కావడం లేదని ఆరోపించారు.  దేశ ప్రధాని నరేంద్ర మోడీ  పర్యటనను అడ్డుకుంటమని ప్రకటించడాన్నితీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  తెలంగాణ ప్రజలు కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారని అన్నారు.  తెలంగాణ లో ఎరువుల కొరత ను నియంత్రణ జరిగే ఛాన్స్ నీ కమ్యూనిస్టుల అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం కమ్యూనిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే బ్రోకర్లకంటే హీనంగా మారిపోయారని, పదవులు, పైసల కోసం పార్టీని దోరల మోకాళ్ల వద్ద పడేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కమ్యూనిస్టులను ఎవరు కోరుకోలేదని, నాటి కమ్యూనిస్టులకు, నేటికమ్యూనిస్టులకు నక్కకు నాగలోకానికి ఉన్నతేడా ఉందన్నారు.

allso read- గవర్నర్ హక్కులను హరిస్తున్న కేసీఆర్: గోనే ప్రకాష్

ప్రజలను నిలువున మోసం చేస్తున్న కేసీఆర్ ను వ్యతిరేకించాల్సింది పోయి, కష్టాల్లో ఉన్న ప్రజలను వదిలేసి దోరల సంకలో చేరడమేంటని ఆరోపించారు. నరేంద్రమోడీ రాష్ట్ర ప్రయోజనార్థం తెలంగాణలో పర్యటిస్తున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణకు ఏవిధంగా అభివద్ది పథకాలను ప్రజలకు అందిస్తారో చెప్పబోతున్నారని అన్నారు. అలాంటి మంచి పర్యటనను, ప్రజలకు ప్రయోజనం చేకూరే పర్యటనను సీపీఎం, సీపీఐ నాయకులు ఎలా అడ్డుకుంటారో..? ప్రజలకు సమాధానమివ్వాల్సి ఉంటుందన్నారు. సీపీఎం, సీపీఐ డ్రామాలను ప్రజలందరు గమనిస్తూనే ఉన్నారని, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు.ఎంతమంది అడ్డుకున్న నరేంద్రమోదీ పర్యటనను ఆపలేరని, సీఎం కేసీఆర్ జుట్టుపీక్కోవాల్సి వస్తుందన్నారు. తెల్దారుపల్లి గ్రామంలో జరిగిన తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసు ఇప్పటి వరకు పురోగతి లేదని, ఆ కేసును మాపీ చేసేందుకు తమ్మినేని వీరభద్రం తన స్వంత నిర్ణయంతో సీఎం కేసీఆర్ కు దగ్గరైయ్యారని, పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలతో పొత్తు కార్యకర్తలకు అసలు ఇష్టం లేదని, అయినప్పటికి కేసు నుంచి బయటపడేందుకు పొత్తు అనే నాటకానికి తెరలేపిన తమ్మినేని వీరభద్రం సంగతి రాబోయే రోజుల్లో ప్రజలే తెలుస్తారని అన్నారు. కచ్చితంగా ప్రభుత్వానికి దమ్ము దైర్యం ఉంటే తెల్దారుపల్లి హత్య కేసును సీబీఐ కి అప్పగించాలని కోరారు. రామగుండంలో జరిగే  ప్రధాని లైవ్ ప్రోగ్రామ్ ను ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లలో రైతులు, ప్రజలు చూసే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్యామ్ రాథోడ్, వెంకటనారాయణ యాదవ్, అనిత, భద్రం, గుప్తా, నాగేశ్వరరావు తదితరులు హాజరైయ్యారు.

allso read- తుమ్మల అనుచరుల్లో నైరాశ..?