ప్రజల జీవితాలను నాశనం చేసింది బీజేపీ: సంభాని
== ప్రజలను మాటలతో మాయచేసింది సీఎం కేసీఆర్
== ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుదాం
== హత్ సే హత్ జోడో యాత్రలో మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్
▪️ సంభాని నేతృత్వంలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
(సత్తుపల్లి-విజయంన్యూస్)
సత్తుపల్లి నియోజకవర్గంలో 51వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా సోమవారం కల్లూరు పట్టణంలో శాంతినగర్ నుండి కప్పలబందం రోడ్డు వరకు ర్యాలీగా జరిగిన ఈకార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పట్టగా మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలుపుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందిస్తూ ఈ క్రింది విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్లు కావస్తున్న ఇప్పటకీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసింది బిఆర్ఎస్ పార్టీ… దళితుబంధు పేరుతో దళితుల ఓట్లకోసం రూ.10లక్షల ప్రకటించి అరకొరగా ఇచ్చి దళితులను మోసం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, రైతులకు పంట రుణాలమాఫీ వంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు
ఇది కూడా చదవండి: మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: సంభాని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల కంటే ముందు ఇచ్చే ప్రతి హామిని అమలు చేసి తీరుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడుతుందని, ప్రజలందరు ఆ కష్టాన్ని నమ్మి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్ టీయుసీ కార్యదర్శి కొత్తా సీతారాములు, పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, రాష్ట్ర జడ్పీటీసీ సంఘం అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్, స్టేట్ ఎస్సీ సెల్ కన్వీనర్ కొండూరు కిరణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, గోళ్ళ అప్పారావు, ఎంపిటిసి మాదిరాజు లక్ష్మణరావు, మాజీ ఎంపిపి గోపాలస్వామి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, పాయపూర్ సర్పంచ్ శర్మ, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొర్రపాటి సాల్మన్ రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివ వేణు పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్ ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్ కంచు కోట అని మరోమారు నిరూపించాలి: సంభాని