గుజరాత్‌లో బీజేపీదే హవ్వా
== 157 స్థానాల భారీ మెజారిటీతో కమల వికాసం
== సంబరాల్లో మునిగిన బీజేపీ నేతలు
== గుజరాత్ లో విజయంతో తెలంగాణ బీజేపీ సంబరాలు
(హైదరాబాద్, గుజరాత్-విజయంన్యూస్)
భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో బీజేపీ హవ్వా కొనసాగింది.. అత్యంత భారీ మెజారిటీతో కమలం జెండా రెపరెపాలాడింది.. వరసగా ఏడవ సారి గుజరాత్ లో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది.. ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీ సాధించిన బీజేపీ పార్టీ కొన్ని రికార్డులను స్రుష్టించిందనే చెప్పాలి. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నాయకులు సంబరాలు చేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా: మనీశ్ సిసోడియా
కాంగ్రెస్ పార్టీకి స్వల్ప అధిక్యం రావడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని స్వంతం చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజుల క్రితం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల జరగ్గా, గురువారం కౌంటింగ్ పక్రియ కొనసాగింది. ఉదయం 7గంటలకే ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రారంభించారు. అయితే ఫలితాల ప్రారంభం నుంచే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ హవ్వా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి చివరి ఫలితం వరకు బీజేపీ తన మార్క్ ను చూపించింది. గతంలోని 2017లో జరిగిన ఎన్నికల్లో 97 స్థానాలను గెలుచుకున్న బీజేపీ పార్టీ, ఈ సారి అందుకు రెట్టింపుకుగా 157 స్థానాలను గెలుసుకుని బీజేపీ విజయఢంకా మోగించిందనే చెప్పాలి. గుజరాత్‌లో వార్ వన్ సైడ్ కావడంతో మరోమారు బిజెపి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 182 స్థానాలకు గానూ 150 కు పైగా స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 23, ఆప్ 5, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గుజరాత్ లోని జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్న క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రవీబా విజయం సాధించగా, గుజరాత్‌లో మరోసారి బీజేపీ జెండా ఎగురవేయబోతుంది. 150 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ 22, ఆప్ 8స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. గుజరాత్ లో కాంగ్రెస్ సీట్లకు ఆప్ గండి కొట్టినట్లు కనిపిస్తోంది. గుజరాత్ బీజేపీ సీఎం క్యాండిడేట్ భూపేంద్ర పటేల్ 25వేల ఓట్లతో విజయం సాధించారు.
== 7వ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీ ఇది కూడా చదవండి: హిమాచల్ ప్రదేశ్ లో హోరాహోరీ ఫలితాలు
ప్రపంచ చరిత్రలో ఎన్నడు జరగని విధంగా గుజరాత్ రాష్ట్రంలో వరసగా ఏడవ సారి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్దం చేస్తోంది. ప్రపంచ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సార్లు విజయం సాధించిన పార్టీలు లేవు. ముఖ్యంగా వార్ వన్ సైడ్ అన్నట్లుగా 182 అసెంబ్లీ స్థానాలకు గాను 157 స్థానాలను గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ కంటే రెట్టింపుగా సీట్లను సాధించి చరిత్ర స్రుష్టించిందనే చెప్పాలి. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి గా మరోసారి భూపేంద్రపటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
== సంబరాల్లో మునిగిపోయిన బీజేపీ శ్రేణులు
గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. గుజరాత్ లోని అన్ని జిల్లాలో, గ్రామగ్రామాన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేస్తున్నారు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలో సంబరాలు చేస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేస్తున్నారు. అయితే హిమాచల్‌లో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని అధికారం చేజిక్కుంచుకునే విధంగా మెజార్టీ సాధించింది. ఇకపోతే ఇది బిజెపికి మింగుడుపడని వ్యవహారంగాచూడాలి.