Telugu News

తెలంగాణ మాటల మాంత్రికుడు కెసిఆర్..: కపిలవాయి దిలీఫ్ కుమార్

మాయ, జూట మాటలతో తెలంగాణను నాశనం చేస్తుండు ...

0

తెలంగాణ మాటల మాంత్రికుడు కెసిఆర్..!

* మాయ, జూట మాటలతో తెలంగాణను నాశనం చేస్తుండు …

* ఇన్నేళ్ల కెసిఆర్ ప్రభుత్వ పాలనలో సాధించిన ప్రగతి ఏంది..?

* పాలన చేతగాక పనికిమాలిన రాజకీయాలు చేస్తుండు..

* ఎమ్మెల్యే రసమయి నియోజకవర్గానికి, శంకరపట్నం మండలానికి చేసిన ఒక్క మంచి పని ఏంటో చెప్పాలి ..?

* ప్రజలను గోస పెడుతున్న టిఆర్ఎస్ కు బుద్ధి చెబుదాం..

ప్రజాగోస -బిజెపి భరోసా యాత్రలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్

(కరీంనగర్-విజయంన్యూస్)

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా..? టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు కూడా మాంత్రికుని లెక్కనే ఉన్నాయని,. కెసిఆర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటని, లెక్కలేనన్ని హామీలిచ్చి మాయ జూట మాటలతో తెలంగాణ జనాన్ని ,రాష్ట్రాన్ని కెసిఆర్ నాశనం చేస్తున్నాడని బిజెపి నేత మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గ ప్రజా గోస – బిజెపి భరోసా యాత్ర కార్యక్రమం ఆదివారం కేశవపట్నం మండలంలోని పలు గ్రామాల మీదుగా కొనసాగింది. ఇట్టి యాత్ర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పలు గ్రామాల్లో బిజెపి జెండా ఆవిష్కరణ జరిపి ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో ప్రసంగించి మాట్లాడారు.

allso read- రేషన్ దుకాణాల్లో  (రా)బందువులు

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కి కెసిఆర్ రాజ్యమేలుతుండని ఆయన మండిపడ్డారు.కెసిఆర్ హామీలు, వాగ్దానాలు కోటలు దాటుతాయి కాని ఆచరణలో అమలు చేసింది ఏమీ లేదన్నారు .ఉద్యమంలో తనతో ఉన్న వాళ్ల కు న్యాయం చేయలే నోడు .. తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు…?తెలంగాణ ఉద్యమంలో తనతో ఉన్న ఉద్యమకారులను అణగదొక్కి తెలంగాణ వ్యతిరేకులను ప్రభుత్వం లోకి తీసుకొని టిఆర్ఎస్ పార్టీఅవకాశవాద రాజకీయాలకు శ్రీకారం చుట్టిందన్నారు.తెలంగాణ ఉద్యమం కోసం తమ ప్రాణాలను అర్పించిన 1200 మంది ఉద్యమ కారుల కుటుంబాల పరిస్థితి ఏంది..?ఉద్యమకారుల పార్టీ టిఆర్ఎస్ అని చెప్పుకునే కేసీఆర్,ఆత్మ బలిదానం చేసిన వందలాది ఉద్యమకారుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చి అమరవీరుల కుటుంబాలకు నేటికీ ఏలాంటి న్యాయం చేయలేదన్నారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలే నోడు.. తెలంగాణ సమాజాన్ని ఏం బాగు చేస్తాడని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి కంకణం కట్టుకొని పాలన కొనసాగిస్తున్నాడని,నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టినటీఆర్ఎస్ ఉద్యమ పార్టీ , నేడు అధికారకాంక్షతో అడ్డదారుల్లో గెలవడానికి ప్రజల ఓట్ల కోసం ఉద్యమం చేస్తున్న ఏకైక పార్టీ గా టిఆర్ఎస్ పార్టీచరిత్రలో నిలిచిపోతుందన్నారు. కెసిఆర్ తన ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో చేసిన ప్రగతి తెలంగాణ సమాజానికి స్పష్టం చేయాలన్నారు. బంగారు తెలంగాణ అంటే ఏందో కూడా కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పనికిరాని ప్రాజెక్టులు కట్టి అదే పెద్ద అభివృద్ధి పని అనుకోవడం కెసిఆర్ మూర్ఖత్వం అన్నారు . టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ చేతికి చెప్ప వచ్చేలా రాష్ట్రాన్ని బజారు పాలు చేసిండని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుతం కెసిఆర్ కు పాలన చేతకాక పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నానని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధికి చాలా దూరంలో ఉందనే విషయం స్పష్టంగా కనబడుతుందన్నారు. ఎమ్మెల్యే రసమయి నియోజకవర్గానికి, నియోజకవర్గంలో భాగమైన శంకరపట్నం మండలానికి చేసిన మంచి పని ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

allso read- రేషన్ దుకాణాల్లో  (రా)బందువులు

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి శంకరపట్నం మండలం అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. మండలంలోని కాచాపూర్ లోని పి హెచ్ సి సెంటర్ ను కూలగొట్టి రైతు వేదిక నిర్మించడం , గద్దపాకలో మహిళా సంఘ భవనం కూల్చడం , దౌర్జనంగా ఆ స్థలాలను ఇతర కార్యక్రమాలకు వాడుకోవడం అభివృద్ధి అంటారా ? అని ఆయన ప్రశ్నించారు . కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం నుండి పాపయ్యపల్లి వరకు ఎమ్మెల్యే రసమయి నిర్మిస్తామన్న రహదారి హామీ ఎందుకు నిలబెట్టుకోలేదన్నారు . కొత్తగట్టు , ములంగూర్, కేశవపట్నంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లుల నిర్మాణానికి స్థలం సేకరించిన ఇప్పటివరకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయకపోవడం ఎమ్మెల్యే రసమయిపనితీరుకు అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ , జూనియర్ కళాశాల , మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే రసమయి హామీ ఇచ్చిన ఇన్నేళ్ల కాలంలో వాటిని నెరవేర్చకపోవడం ఆయన వైఫల్యమే అన్నారు . కేశవపట్నం మండలాన్ని సీడ్ హబ్ గా మార్చి, స్థానిక ప్రజానీకానికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్న ఆ దిశగా ఎమ్మెల్యే రసమయి కృషి చేయకపోవడం దారుణం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయకుండా అన్ని వర్గాల ప్రజలను గోసపెడుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశం కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే బిజెపి మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
ఈ ర్యాలీలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న, ఓరెం జయ చందర్, సొల్లు అజయ్ వర్మ, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, మాడ వెంకట్ రెడ్డి, సాయిని మల్లేశం, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజిరెడ్డి,శంకరపట్నం మండలం అధ్యక్షులు చల్ల ఐలయ్య, కేశపట్నం ఎంపీటీసీ సభ్యులు అనిల్, లింగాపూర్ ఎంపీటీసీ అంతం లతా రాజిరెడ్డి, కొయ్యడ అశోక్, ఎలుకపల్లి సంపత్, మునిగంటి కుమార్, నరేష్, జగ్గారెడ్డి, సాగర్ గౌరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.