Telugu News

బీజేపీ నాయకుడు ఆత్మహత్యయత్నం

== పరిస్థితి విషమం.. యశోదా ఆసుపత్రికి తరలింపు == ఏసీపీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతల ధర్నా == పోలీసులపై మండిపడిన బీజేపీ నాయకులు

0

బీజేపీ నాయకుడు ఆత్మహత్యయత్నం
== పరిస్థితి విషమం.. యశోదా ఆసుపత్రికి తరలింపు
== ఏసీపీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతల ధర్నా
== పోలీసులపై మండిపడిన బీజేపీ నాయకులు
(ఖమ్మం-విజయంన్యూస్)

ఖమ్మం పోలీసులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వత్తిడి కి లొంగి బీజేపీ నాయకుల పై అక్రమ కేసులతో వేధిస్తున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలో నే బీజేపీ నాయకుడు సాయి చౌదరి ఆత్మహత్య ప్రయత్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పాల్పడ్డాడని అన్నారు.సాయి చౌదరి పరిస్థితి విషమించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచన మేరకు మలక్ పేట యశోదా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఖమ్మం ఆరోగ్య ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ కార్యకర్తలు పోలీసుల కు మంత్రి పువ్వాడ అజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ఏసీపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసులు బాధ్యతలు విస్మరించి మంత్రి కనుసన్నల్లోనే బీజేపీ నాయకుల పై అమానుషం గా వ్యవహరిస్తున్నారని సాయి చౌదరి కి ఏదీ జరిగినా మంత్రి పువ్వాడ అజయ్ నైతిక బాధ్యత వహించాలని. ఏప్రిల్ 6 వ తేదీన పార్టీ పతాకం ఎగురవేయలని అనుకోవడమే సాయి చేసిన నేరమా అని పోలీసులను ప్రశ్నించారు. కేటీఆర్ ఖమ్మం వస్తే అడ్డుకొని తీరుతామని బీజేపీ నాయకులు నినాదాలు చేశారు.

also read :-డిల్లీలో మళ్ళీ…! డిల్లీలో 24 గంటల వ్యవధిలోనే 50 శాతం అధికంగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

also read :- 8 ఏండ్లుగా ఇంటి స్థలాలు ఎందుకు ఇవ్వలేదు..?: భట్టి

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 7 డివిజన్ కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్యామ్ రాథోడ్, రుద్ర ప్రదీప్, నున్నా రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి బోయినపల్లి చంద్రశేఖర్, జిల్లా అధికార ప్రతినిధులు వట్టికొండ శ్రీనివాసరావు, వీరవల్లి రాజేష్ గుప్తా, వెంకట్ నారాయణ యాదవ్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావాకిరణ్, మహిళా మోర్చా దొడ్డ అధ్యక్షులు దొడ్డ అరుణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వీరూ గౌడ్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రవి రాథోడ్, వేల్పుల సుధాకర్, త్రీ టౌన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా, అర్బన్ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాస్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లారావు గౌడ్ గారు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈధుల వీరభద్రం, తక్కెళ్లపల్లి మునేష్ రావు, నెల్లూరు కోటేశ్వరరావు, ఏపూరి నాగేశ్వరరావు, పాపారావు, దుద్దుకూరు కార్తీక్, నాగమణి, పని కుమారి, పృథ్వి, కోటేశ్వరరావు, సురేష్, తదితరులు పాల్గొన్నారు..