Telugu News

శాసనసభ నుంచి భాజపా MLAలు సస్పెండ్‌

హైదరాబాద్ విజయం న్యూస్

0

శాసనసభ నుంచి భాజపా MLAలు సస్పెండ్‌

(హైదరాబాద్ విజయం న్యూస్):-

తెలంగాణ శాసనసభలో భాజపా సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, రాజాసింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

బడ్జెట్‌ ప్రసంగానికి అడ్డుతగిలినందుకుగానూ ఈ సెషన్‌ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా భాజపా సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.