Telugu News

కేసీఆర్….ఇక కాస్కో..: బండిసంజయ్

అడుగడుగునా పాదయాత్రను అడ్డుకోవాలనుకున్నవ్

0

కేసీఆర్….ఇక కాస్కో..: బండిసంజయ్

== అడుగడుగునా పాదయాత్రను అడ్డుకోవాలనుకున్నవ్

== సభ, ర్యాలీ జరగకుండా ఇచ్చిన జీవోను ఫ్రేమ్ కట్టించుకో

== న్యాయం మా పక్షానే ఉంది… హైకోర్టుకు ధన్యవాదాలు

== లిక్కర్ స్కాంపై చర్చను దారి మళ్లించేందుకే ఈ కుట్రలన్నీ

== రేపటి భారీ బహిరంగ సభను గ్రాండ్ చేసి తీరుతాం

== పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 

(రిపోర్టర్ : శోభన్ బాబు)

వరంగల్ ప్రతినిధి, ఆగస్టు 26(విజయంన్యూస్)

ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగుతున్న పాదయాత్రను అడుగడుగునా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరగబోయే సభను కూడా అడ్డుకునేందుకు నీచపు కుట్రలు చేశారని, చివరకు సభలు, ర్యాలీలు జరగకుండా పోలీస్ కమిషర్ తో నిషేధిత ఉత్తర్వులు కూడా జారీ చేయించారని అన్నారు. ‘‘కేసీఆర్… పండగ చేస్కో… పాదయాత్రను అడ్డుకోవడానికి చేయాల్సినవన్నీ చేశావ్. ఆఖరుకు సభ జరగకుండా జీవో ఇచ్చినవ్.. ఆ జీవో కాపీని ఫ్రేం కట్టించి ఇంట్లో పెట్టుకో… భవిష్యత్తులో అన్నీ గుర్తుకు రావాలి కదా.. ’’అని వ్యాఖ్యానించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గంలోని నాగాపురం సమీపంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…    ఇది కూడా చదవండి :  జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

• 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రతీసారి సీఎం కేసీఆర్ ఏదో ఒక విధంగా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి, రెండవ సారి పాదయాత్ర ను అలానే చేశారు. మూడో సారి అయితే.. రెట్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

• ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం ప్రమేయం పై ఆరోపణలు వచ్చాయి… కేసీఆర్ దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. మునావర్ ఫారాఖీ షో కి ఎలా అనుమతి ఇచ్చారు? ప్రజా సంగ్రామ యాత్ర ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే… కోర్టు అనుమతి తో మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాం.

• అయినా సరే.. ఎలనైనా మా పాదయాత్ర, బహిరంగ సభను అడ్డుకోవాలని చూస్తున్నారు. సభకు అనుమతి తీసుకున్నాం… అయినా అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో.. సభకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు.

• శాంతిభద్రతలను సాకుగా చూపి, బహిరంగ సభను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఆఖరుకు సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఉంచుకో.. ఆ జీవోను ఫ్రేం కట్టించుకుని ఇంట్లో పెట్టుకో… కావాలంటే నను కూడా ఫ్రేం కట్టించి పంపుతా.. భవిష్యత్తులో అన్నీ గుర్తుండాలి కదా…

• గౌరవ హైకోర్టు రేపటి బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది. గౌరవ హైకోర్టు కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజాస్వామ్య పద్దతిలో… పాదయాత్ర చేస్తున్నాం. బహిరంగ సభను నిర్వహించి తీరుతాం.

ఇది కూడా చదవండి : సర్వం సిద్దమైన సర్కార్ మెడికల్ కళాశాల

• కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా… న్యాయస్థానం, న్యాయం… మావైపే నిలబడింది. కేసీఆర్ నిర్బంధాలపై బీజేపీ యుద్ధం చేస్తోంది. రేపు భారీ బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి, విజయవంతం చేయాలని కోరుతున్నా.

• రేపు మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ లో భారీ బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిధిగా పాల్గొంటారు. కచ్చితంగా బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేస్తాం. కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వాళ్లంతా బహిరంగ సభకు తరలిరావాలని కోరుతున్నా. అట్లాగే ప్రతి బీజేపీ కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో బహిరంగ సభకు తరలిరావాలి.

• భద్రకాళి టెంపుల్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటాం. 30 యాక్ట్ ను పోలీసులు లామినేషన్ చేసి పెట్టుకోవాలని బండి సంజయ్ సూచన