Telugu News

అధికార అహంకారంతో ఊగిపోతున్న బిజెపి:రాయల

0

అధికార అహంకారంతో ఊగిపోతున్న బిజెపి:రాయల

== రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఇక చాలంటున్న ప్రజలు

== తెచ్చుకున్న తెలంగాణను నవ్వుల పాలు చేసిన టిఆర్ఎస్

== డబ్బుతో ప్రజలను కొనుగోలు చేయోచ్చన్న భ్రమల్లో ఉన్న టిఆర్ఎస్, బీజేపీ

== రాష్ట్ర ప్రజల సంక్షేమంగా ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి

== రాహుల్ గాంధీని ఆశీర్వదించండి

== హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండా గ్రామంలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జెండాను, ఆవిష్కరించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారం, అహంకారంతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై బిజెపి అడుగులు వేస్తూ అణగదొక్కుతున్నదని రాయల నాగేశ్వరరావు అన్నారు. అధికారానికి,అడ్డులేదన్న అహంభావపూరిత వాతావరణంలో తెలంగాణ పై బిజెపి దాడిచేయడానికి వస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు‌..

allso read- హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రకు రాండీ:భట్టి

తెలంగాణ ప్రజలను అనగదొక్కాలని చూసిన ప్రతి సందర్భంలో ఇక్కడి ప్రజలు మట్టి మనుషులుగా ఎదిరించి ఎదురొడ్డి పోరాటం చేశారే తప్పా తలవంచుకున్న చరిత్ర ఈ పోరాటాల గడ్డకు లేదన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో విర్రవీగుతున్న బిజెపికి ఇక్కడి ప్రజలు అదే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలన ఇక చాలు అని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. దోపిడి, అవినీతికి పాల్పడుతూ, ఉన్న వనరులను ప్రజలకు ఇవ్వకపోగా తెచ్చుకున్న తెలంగాణను టిఆర్ఎస్ నవ్వుల పాలు చేసిందని వండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన  తెలంగాణ సమాజంలో తలెత్తుకొని బతకాలన్న బహుజనుల ఆత్మగౌరవం టిఆర్ఎస్ పాలనలో భంగపాటయిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన టిఆర్ఎస్ అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్న టిఆర్ఎస్ బిజెపి పార్టీల మెడలు వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బిజెపి,రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేస్తున్నాయి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.. అనంతరం ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీ  సందేశాన్ని విసృతంగా ప్రచారం చేస్తూ యాత్రలో ముందుకు సాగుతుండగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు..

allso read- ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపేందుకు ?